Actress: స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే అవమానించారు.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ నటి

ప్రముఖ నటి, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి కి చేదు అనుభవం ఎదురైంది. దీనిపై ఆమె పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. ఇటీవల నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో వేదికపైనే అందరి ముందు తనను అవమానించారని నటి ఫిర్యాదులో పేర్కొంది.

Actress: స్టేజ్‌పై అందరూ చూస్తుండగానే అవమానించారు.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ నటి
Actress Mimi Chakraborty

Updated on: Jan 29, 2026 | 7:45 AM

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని ఒక జిల్లాలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వేదికపైనే తనను వేధించారని, తన కార్యక్రమం బలవంతంగా ఆపారని, అందరి ముందు అవమానించారని నటి మిమి చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని నయాగ్రామ్‌లోని బోంగాన్ నగరంలో ఇటీవల ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. మిమి చక్రవర్తిని అతిథిగా ఆహ్వానించారు. అయితే నటి మిమి ప్రదర్శన ఇస్తుండగా వేదికపైకి ఎక్కిన నిర్వాహకులలో ఒకరైన తన్మయ్ శాస్త్రి, ప్రదర్శనను ఆపమని ఆమెను బలవంతంగా కిందకు దించాడు. ‘ఆపు, ఇక్కడి నుండి వెళ్లిపో’ అని పరుషంగా మాట్లాడాడని మిమీ ఫిర్యాదులో పేర్కొంది.

అయితే షో నిర్వాహకులు మాత్రం వేరే విషయం చెబుతున్నారు. పోలీసులు స్టేజ్ షోకు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నటి దాదాపు గంట ఆలస్యంగా షోకి రావడమే కాకుండా, వేదికపై చాలా సమయం కూడా తీసుకుంది. పోలీసు నిబంధనల కారణంగా షో ఆపమని నటిని కోరినట్లు వారు తెలిపారు. నిర్వాహకులు కూడా తాము ఎలాంటి హింసకు పాల్పడలేదని లేదా నటితో అవమానకరమైన రీతిలో ప్రవర్తించలేదని చెప్పారు. బదులుగా, నటి బౌన్సర్లు మాతో అనుచితంగా ప్రవర్తించారని వారు వాపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఘటనపై నటి మిమి చక్రవర్తి ఒక ఇమెయిల్ ద్వారా బొంగాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిందీ నటి. అయితే దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంందరు ఆమెకు సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మిమి చక్రవర్తి బెంగాలీ చిత్ర పరిశ్రమలో చాలా ప్రజాదరణ పొందిన నటి. మాజీ టీఎంసీ ఎంపీ కూడా. బెంగాలీ చిత్రాలతో పాటు, మిమి ఒక బాలీవుడ్, బంగ్లాదేశ్ చిత్రాల్లోనూ మిమి నటించింది.

మిమి చక్రవర్తి పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.