Chiranjeevi: ఏంటి.. నిజమా..? ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిందా చిరంజీవా..?

చిరంజీవి అంటేనే డ్యాన్స్. నాట్యంలో ఆయన్ని కొట్టే హీరో ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదని చెబుతారు ఫ్యాన్స్. డ్యాన్స్ అంటే కేవలం మూమెంట్స్ కాదు.. ఆ పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు చిరు. అందుకు తగ్గట్లుగా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు ...

Chiranjeevi: ఏంటి.. నిజమా..? ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిందా చిరంజీవా..?
Radhika Chiranjeevi

Updated on: Jan 25, 2026 | 9:33 AM

“సంధ్య పొద్దుల కాడ” చిరంజీవి కెరీర్‌లో చాలా గుర్తుండిపోయే క్లాసిక్ సాంగ్. ఈ పాటలో చిరంజీవి గ్రేస్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. నటి రాధిక కూడా చిరంజీవికి ఏ మాత్రం తగ్గకుండా స్టెప్స్ వేస్తుంది. ఈ పాట 1984లో వచ్చిన ఛాలెంజ్ సినిమాలోనిది.
ఇళయరాజా ఈ బాణీని సమకూర్చారు. వేటూరి సుందరరామమూర్తి అద్భతమైన సాహిత్యం అందించగా.. ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పాటను పాడి ఊపిరి పోశారు. సాయంత్రం నిశ్శబ్దాన్ని, ప్రేమలోని మౌనాన్ని చాలా సున్నితంగా చూపించే పాట ఇది. వేటూరి గారి పదాలు, ఇళయరాజా మెలోడీ కలగలిపి.. సాంగ్ స్వచ్ఛమైన క్లాసిక్ ఫీల్‌లో ఉంటుంది.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటగే.. చిరంజీవి, రాధికలు స్వయంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు ప్రత్యేక కొరియోగ్రాఫర్ అందుబాటులో లేకపోవడంతో, చిరంజీవి స్వయంగా ముందుకొచ్చి, తన సహచరుడితో కలిసి నృత్య రూపకల్పన బాధ్యతను స్వీకరించారు. ఒక్క రోజులోనే నృత్య సన్నివేశాలను రూపొందించి, షూటింగ్ పూర్తి చేశారు. సంధ్యా పొద్దుల కాడ అనే టైటిల్ తో ఉన్న ఈ పాట.. మధురమైన పంక్తులతో సాగుతుంది. ఈ పాటలోని అందమైన సాహిత్యం, సుందరమైన సంగీతానికి చిరంజీవి చేసిన కొరియోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచి, ఇప్పటికీ ఈ పాటను సంగీత ప్రియులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇది వాట్సాప్ స్టేటస్‌లలో కూడా తరచుగా కనిపిస్తుంది. అది చిరంజీవి అంటే.. నాకు తెలిసి డ్యాన్స్‌లో బాస్‌ని కొట్టేవారు ఉండరేమో..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.