Pushpa: The Rise: అల్లు అర్జున్ పుష్ప పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దళపతి విజయ్ డైరెక్టర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Pushpa: The Rise: అల్లు అర్జున్ పుష్ప పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దళపతి విజయ్ డైరెక్టర్..
Pushpa
Follow us

|

Updated on: Jan 15, 2022 | 3:09 PM

Pushpa: The Rise: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ విన్న పుష్ప సినిమా పాటలే. ఎక్కడ చుసిన పుష్ప సినిమా డైలాగులే.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూడవ సినిమా ఇది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు బన్నీ – సుకుమార్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య,ఆర్య 2 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు రికార్డు కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక పుష్ప సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు , సినిమా తారలు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ పుష్ప సినిమా పైప్రశంసలు కురిపించాడు. నెల్సన్ దిలీప్ ప్రస్తుతం దళపతి విజయ్ తో బీస్ట్ సినిమాను తెరకెక్కస్తున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా పై స్పందిస్తూ.. ఇలాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు.. బన్నీ నటన అద్భుతం అంటూ ట్వీట్ చేశారు నెల్సన్ దిలీప్. ఈ ట్వీట్ పై స్పందించారు అల్లు అర్జున్. చాలా థాంక్యూ నెల్సన్ సార్. మీకు నా నటన నచ్చడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ డాక్టర్ సినిమా చాలా బాగుంది. ఈమద్య కాలంలో నాకు నచ్చిన సినిమా మీ డాక్టర్ అంటూ అల్లు అర్జున్ నెల్సన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. ఇక పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నారు సుకుమార్ అండ్ టీమ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral video: కంగనా బుగ్గల కంటే సున్నితమైన రోడ్లను నిర్మిస్తాం.. వైరల్ గా మారిన జార్ఖండ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Hero Movie Review: హీరో మూవీ రివ్యూ.. ప్రతి సీనులోనూ ‘హీరో’ ఎలివేషనే!

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..