హీరోయిన్ మారింది.. మోక్షజ్ఞ  సినిమాలో ఆ అందాల భామ.. ఫ్యాన్స్‌కు పూనకాలే

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.. నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి మోక్షజ్ఞ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

హీరోయిన్ మారింది.. మోక్షజ్ఞ  సినిమాలో ఆ అందాల భామ.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Nandamuri Mokshagna

Updated on: Nov 12, 2025 | 12:40 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే భారీ సినిమాలను కూడా లైనప్ చేశారు. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్  సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఇప్పుడు అలాగే బోయపాటితో అఖండ 2ను కూడా లైనప్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..

ఇక ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ అదిరిపోయే స్టోరీని రెడీ చేశాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సింబ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీ అందమైన లవ్ స్టోరీతో ఉండే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని కొందరు అంటున్నారు. మరికొందరేమో యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైన మోక్షజ్ఞ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మొన్నామధ్య మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించే ఛాన్స్ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి హీరో పక్కన శ్రీలీల కరెక్ట్ గా సెట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు శ్రీలీల కాదు మరో హీరోయిన్ నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ  సరసన ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని. రవీనా టాండన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. తెలుగులోనూ రవీనా నటించారు. ఇక రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 2లో కీలక పాత్రలో నటించి మెప్పించింది రవీనా. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కోసం రవీనా కూతురు రాషా థడానిని రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే ఈ చిన్నది ఆడిషన్ కూడా ఇచ్చిందని.. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానుందని టాక్ వినిపిస్తుంది. బాలీవడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. తన అందాలతో కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us