Balakrishna: బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి అతడే.. ఎవరో తెలుసా .. ?

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయ్యిందని సమాచారం. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ తీసుకుంటారని.. అనంతరం కొద్ది రోజులు బాలకృష్ణ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ మూవీ తిరిగి పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్యకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Balakrishna: బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి అతడే.. ఎవరో తెలుసా .. ?
Balakrishna

Updated on: May 03, 2024 | 1:45 PM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్‎కు బ్రేక్ ఇచ్చాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయ్యిందని సమాచారం. అయితే ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ తీసుకుంటారని.. అనంతరం కొద్ది రోజులు బాలకృష్ణ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ మూవీ తిరిగి పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్యకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

గతంలో ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ షోకు బాలకృష్ణ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్, నటీనటులు ఈ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా హజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ ఫాస్టెస్ట్ డైరెక్టర్ అని.. 9 రోజులలో స్టోరీ రాసి.. ఆరు నెలల్లో మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో బాలకృష్ణ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఇండస్ట్రీలో తనను “బాలా” పిలిచే ఒకే ఒక్క వ్యక్తి పూరి జగన్నాథ్ అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.