ఒంగోలులో బాలకృష్ణ మూవీ వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లను పరిశీలించారు సీఐ శ్రీనివాస్‌రెడ్డి. అనుమతుల మేరకే ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. పార్కింగ్, వీఐపీ వాహనాల ఎంట్రీ, ఎగ్జిట్, ప్రేక్షకుల గ్యాలరీ వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోలులోని ఎబిఎం కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఏబీఎం కాలేజీ దగ్గర పార్కింగ్ లేకపోవడం, ఎదురుగా రైల్వే స్టేషన్ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ఈవెంట్ కు అనుమతులు రద్దు చేశారు పోలీసులు.
దీంతో సినిమా వేదికను ఏబీఎన్ కాలేజీ నుంచి త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ఫ్రా స్థలానికి మార్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ ఏర్పాట్లను ఒంగోలు సీఐ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఇదిలా ఉంటే..మరోవైపు ఒంగోలులో వర్షం పడుతోంది. దీంతో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులకు అంతరాయమేర్పడింది. ఇక ABM కాలేజీ దగ్గర పార్కింగ్ సమస్యతో పాటు..ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో వేదికను మార్చారు పోలీసులు. అర్జున్ ఇన్‌ఫ్రాలో వేడుకకు అనుమతివ్వడంతో ఏర్పాట్లుచేస్తున్నారు నిర్వహాకులు.
మరోవైపు ఈవెంట్‌కు అనుమతిచ్చేందుకు 18 అంశాలపై క్లారిటీ కోరారు పోలీసులు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు 20వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలపడంతో..పాసులపై నంబర్లు ప్రింట్ చేయాలని కోరారు పోలీసులు. ఇక వీరసింహారెడ్డి ఈవెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. పార్కింగ్ సహా ఇతర ఇబ్బందులతో వేదిక మార్చక తప్పలేదన్నారు. అనుమతుల విషయంలో ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదన్నారు.