Balakrishna: బాలకృష్ణ కి MRI స్కానింగ్.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

హీరో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్యకు ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించిన వైద్యులు కీలక ప్రకటన చేశారు.

Balakrishna: బాలకృష్ణ కి MRI స్కానింగ్..  డాక్టర్లు ఏమంటున్నారంటే?
Balakrishna, CM Chandrababu Naidu

Updated on: Jul 21, 2026 | 6:21 PM

హీరో నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న NBK111 (వర్కింగ్ టైటిల్) సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణ కు గాయమైనట్లు సమాచారం. ఈ విషయం తెలియగానే బాలకృష్ణ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా బాలకృష్ణకు సిద్ధార్థ హాస్పటల్ వైద్యులు MRI స్కానింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోకాలు దగ్గర ఇబ్బంది గా ఉందని బాలయ్య చెప్పారని వైద్యులు తెలిపారు. కనీసం వారం రోజులు పాటు రెస్ట్ తీసుకోవాలని బాలయ్యుకు డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం ఆయన జీఆర్‌టీ హోటల్ లోనే ఉన్నారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం హైదరాబాద్ కి బాలకృష్ణ వెళ్తారని చిత్ర బృందం చెబుతోంది. మరోవైపు కాలు నొప్పి కొంచెం తగ్గిన తర్వాత జర్నీ చేయాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.

కాగా బాలయ్య ఆరోగ్య పరిస్థితిపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. ‘NBK111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది. వైద్యుల సూచన మేరకు, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు గోపీచంద్.

ఇవి కూడా చదవండి

ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాలయ్య ఆరోగ్యంపై ఆరా తీశారు.  నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. నందమూరి హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

చంద్రబాబు ట్వీట్..

గోపీచంద్ మలినేని ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us