Balayya: బాలయ్యకు నచ్చితే అంతే.. ఫ్లైట్​లో పరిచయమైన వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి..

Nandamuri Balakrishna: విమానంలో బాలయ్యకు అతడు పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ప్రవర్తన నచ్చడంతో.. తన మిత్రడిలా భావించాడు నటసింహం. అంతేకాాదు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఒక్కసారిగా సర్‌ప్రైజ్ చేశారు.

Balayya: బాలయ్యకు నచ్చితే అంతే.. ఫ్లైట్​లో పరిచయమైన వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి..
Nandamuri Balakrishna

Updated on: Jun 15, 2023 | 3:35 PM

ఒకప్పుడు అమ్మో బాలయ్య అనేవారు. ఇప్పుడు అందరూ వెన్నలాంటి మనసు మా బాలయ్యది అంటున్నారు. అవును.. అప్పటివరకు విపరీతమైన కోపం ఉన్న వ్యక్తిగా బాలయ్యను ప్రొజెక్ట్ అయ్యారు. కానీ అన్‌స్టాపబుల్ షోతో ఆయన అసలు మనసు ఏంటో జనాలకు తెలిసింది. ఆయనది చిన్న పిల్లాడి లాంటి మనస్తత్వం అని అర్థమైపోయింది. బాలయ్య చాలా ఫ్యూర్ అని, మాస్క్ ఉండదని ఎప్పటి నుంచో ఇండస్ట్రీ జనాలు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. బయటివాళ్లకు అర్థమవ్వడానికి ఇంతకాలం పట్టింది. ఇక బాలయ్య.. రిచ్, పూర్ అని తేడా ఉండదు. అందరినీ ఒకేలా చూస్తారు. ఫిల్టర్ లేని బాలయ్య… మరోసారి తన నైజంతో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయ్యారు.

ప్రజంట్ సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న బాలయ్య…  విమానంలో పరిచయమైన వ్యక్తి.. ఇంటి గృహాప్రవేశానికి వెళ్లి.. అతడి కుటుంబాన్ని.. ఆ ప్రాంతంలోని జనాన్ని ఆశ్చర్యపరిచారు. తనకు ఓ మనిషి నచ్చితే.. ఎంతవరకు అయినా వెళ్తానని మరోసారి నిరూపించారు. ఇటీవల విమానంలో వెళ్తుండగా.. హరీష్ వర్మ అనే వ్యక్తితో బాలయ్యకు పరిచయం అయ్యింది. అలా అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో మాటల సందర్భంలో తన ఇంటి గృహ ప్రవేశం ఉందని హరీష్.. బాలయ్యకు చెప్పారట. ఆ డేట్ నోట్ చేసుకున్న బాలయ్య.. సరిగ్గా గృహప్రవేవం రోజు అక్కడికి వెళ్లి.. తన ట్రావెల్ ఫ్రెండ్‌ను ఆశ్చర్యపరిచాడు. ప్రజంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా ఊర మాస్ అని ఇటీవల టీజర్ చూస్తేనే అర్థమయ్యింది. తర్వాత బాబీ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు నటసింహం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి