Balakrishna : వారణాసిలో అఖండ 2 టీమ్.. బోయపాటితో కలిసి బాలకృష్ణ ప్రత్యేక పూజలు..

నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2: తాండవం. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 59.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్‌ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

Balakrishna : వారణాసిలో అఖండ 2 టీమ్.. బోయపాటితో కలిసి బాలకృష్ణ ప్రత్యేక పూజలు..
Balakrishna

Updated on: Dec 19, 2025 | 1:34 PM

వారణిసిలో కాశీవిశ్వనాథ స్వామిని హీరో నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. సనాతన ధర్మం గురించి నేటి తరం తెలుసుకోవాలని, సనాతన సైనికుడిగానే అఖండ-2 సినిమాలో నటించానన్నారు బాలకృష్ణ. అఖండ-2 చిత్రానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, యూపీ సీఎం యోగిని చిత్ర నిర్మాత, దర్శకులు కలిసి సినిమా గురించి వివరించారని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..

డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మంచి వసూల్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్రయూనిట్ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో అడుగుపెట్టింది. అఖండ 2 చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య అఘోరగా కనిపించారు.

ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..