ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత దర్శకుడిగా తనలోని ప్రతిభను చాటుకున్నాడు వేణు. పలు సినిమాల్లో కమెడియన్ గా హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు వేణు. ఇక బలగం సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు. బలగం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం నావల్ల కాదు.. దేవుడి దయ ఉంటే ఆయనతో సినిమా చేస్తా: వేణు
Venu

Updated on: Aug 19, 2026 | 1:06 PM

బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్దండి, తన సినీ ప్రస్థానం, రచయితగా అందించిన సహకారం, అలాగే  పెద్ద హీరోలతో సినిమా చేసే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. గతంలో కమెడియన్ గా నవ్వులు పూయించిన వేణు ఆతర్వాత దర్శకుడిగా మారాడు. ఇక బలగం సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . కాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. సినిమాకి రాకముందే తాను మంచి రచయితనని చాలా మందికి తెలియదని, పేరు వేసుకోకుండానే డైలాగులు రాసి వచ్చేశానని ఆయన తెలిపారు. రుద్రమదేవి చిత్రంలోని గోనగన్నారెడ్డి పాత్రకు సంబంధించి తాను అందించిన రచన సహకారాన్ని వేణు యెల్దండి పంచుకున్నారు. రాజసింహ, గుణశేఖర్ వంటి వారు పనిచేస్తున్నప్పుడు, తెలంగాణ మాండలికంలో డైలాగులు రాయాల్సిన అవసరం ఏర్పడగా, రాజసింహ తనను తీసుకెళ్లారని చెప్పారు. అల్లు అర్జున్ పాత్ర చెప్పే కొన్ని సామెతలు, “వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న…” వంటి ఇంటర్వెల్ ముందు వచ్చే డైలాగ్ ఆలోచన తనదేనని అన్నారు వేణు.  అల్లు అర్జున్ అన్ని ఫంక్షన్లలో “థాంక్యూ వేణు” అని చెప్పినా, అది తానేనని జనాలకు తెలియదని అన్నారు వేణు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

అలాగే, జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్, ప్రదీప్ రావత్ మధ్య వచ్చే చేపల ఫైట్ సన్నివేశం కంటెంట్ కూడా తనదేనని వేణు యెల్దండి వెల్లడించారు. దర్శకుడిగా అంత పెద్ద హీరోలని డీల్ చేసే సామర్థ్యం నాలో ఇంకా లేదని అనుకుంటున్నాను అని వేణు యెల్దండి తెలిపారు. బలగం వంటి రా కంటెంట్‌కు ఇమేజ్ లేదని, కానీ పెద్ద హీరోలకు వందల కోట్ల బ్రాండ్ ఇమేజ్ ఉంటుందని, దానిని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతూ, “నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు” అనుకోవడం తప్పు అని వేణు యెల్దండి అన్నారు. అది కేవలం కథ కాదని, వందల కోట్ల బ్రాండ్ ఇమేజ్, కోట్లాది మంది అభిమానుల అంచనాలను సమర్థవంతంగా తీర్చడమే కమర్షియల్ సినిమా అని పేర్కొన్నారు. దానిని డీల్ చేయడానికి ఎంతో మెచ్యూరిటీ, శక్తి కావాలని, అది కత్తిమీద సాము లాంటిదని ఆయన అన్నారు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, బలగం తర్వాత పెద్ద సినిమా చేయాలనే ఆశ ఉందని, కానీ దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ప్రతి సినిమాలో తనదైన ఒక టచ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే అత్తారింటికి దారేది సమయంలో పవన్ కళ్యాణ్ తనను చూసి “నువ్వు ఉగ్గు కథ చేశావు కదా, ఈగ ఆడియో ఫంక్షన్‌లో క్యాబ్‌లో చూశాను” అని తన గత పనులను గుర్తు చేసుకున్నారని తెలిపారు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనలోని నటుడిని గుర్తించి, “నువ్వు కమెడియన్ కాదు, యాక్టర్” అని చెప్పి, తనకు సీరియస్ పాత్ర ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు తాను ఓ అభిమానినని, విడుదల రోజు థియేటర్‌లో అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అది దైవకృప అని వేణు యెల్దండి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us