Venu Tillu : బంపర్ ఆఫర్ కొట్టేసిన బలగం డైరెక్టర్.. మరో సినిమాకు ఛాన్స్..

జబర్దస్త్‌ వేణుగానే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక తాజాగా తన డైరెక్ట్‌ చేసిన బలగం మూవీ వండర్స్ క్రియేట్‌ చేస్తుండడంతో.. బలగం వేణుగా మారిపోయారు.

Venu Tillu : బంపర్ ఆఫర్ కొట్టేసిన బలగం డైరెక్టర్.. మరో సినిమాకు ఛాన్స్..
Venu Yeldandi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2023 | 1:02 PM

అప్పుడెప్పుడో.. ప్రభాస్ మున్నా సినిమాతో.. టిల్లు క్యారెక్టర్‌తో.. టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న వేణు.. ఆ తరువాత జబర్దస్త్‌ కారణంగా.. స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్‌ వేణుగానే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక తాజాగా తన డైరెక్ట్‌ చేసిన బలగం మూవీ వండర్స్ క్రియేట్‌ చేస్తుండడంతో.. బలగం వేణుగా మారిపోయారు. ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేశారు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి.. ఓ పక్క కామెడీ క్యారెక్టర్స్‌ చేస్తూనే మరో పక్క.. ఘోస్ట్ డైలాగ్ రైటర్‌గా వర్క్‌ చేస్తూ వచ్చిన వేణు.. తాజాగా బలగం సినిమాను తనే రాసుకున్నారు. రాసుకోవడమే కాదు.. తన కంటెంట్‌తో.. స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజును ఒప్పించి.. సినిమాను ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు అందరికీ నచ్చడంతో.. రికార్డ్స్ క్రియేట్‌ చేస్తున్నారు. దాంతో పాటే తాజాగా దిల్ రాజు ఇచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను కూడా అందుకున్నారు ఈ మ్యాన్.

బలగం సినిమా అనుకున్నదాని కంటే.. బిగ్ హిట్ అవడం.. ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను కూడా దక్కించుకుంటూ ఉండడంతో.. తాజాగా దిల్ రాజు బలగం వేణుకు మరో సినిమా ఛాన్స్ ఇచ్చారట. స్టోరీ రెడీ చేసుకో.. నీకు కావాల్సిన హీరో డేట్స్‌ ఇపిస్తా .. భారీ బడ్జెట్ కూడా ప్రొవైడ్‌ చేస్తా అని మాట ఇచ్చారట. ఇక ఇదే విషయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌ గా మారింది. బలగం సినిమాతో వేణు లైఫ్ టర్న్‌ అయిందనే కామెట్ అంతటా వినిపిస్తోంది.