Dil Raju Wife: ఆ సినిమా అసలు ఆడదని దిల్ రాజుకి చెప్పిన భార్య.. కట్ చేస్తే రిలీజ్ అయ్యాక..

తెలుగు సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్ నిర్మాత దిల్ రాజు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విజనరీ. కేవలం సినిమాలు తీయడమే కాదు, మంచి కథలను నమ్మి, కొత్త దర్శకులు.. నటీనటులను ప్రోత్సహించి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత ఆయనది.

Dil Raju Wife: ఆ సినిమా అసలు ఆడదని దిల్ రాజుకి చెప్పిన భార్య.. కట్ చేస్తే రిలీజ్ అయ్యాక..
Dil Raju Tejaswini

Updated on: Jan 24, 2026 | 3:06 PM

దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఆయన ఎదిగారు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ అందుకున్నారు. మధ్యలో ఫ్లాప్స్ అందుకున్నప్పటికీ.. ఆయనకు సక్సెస్ రేటు ఎక్కువే. ఆయన ప‌ర్స‌న‌ల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదటి భార్య అనిత కొన్ని సంవ‌త్స‌రాల క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసింది. దీంతో తేజ‌స్విని అనే యువ‌తిని రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. తేజస్వీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమా మరేదో కాదు బలగం. ఈ మూవీ పెద్దగా క్లిక్‌ అవ్వదని దిల్ రాజుతో ఆమె చాలాసార్లు చెప్పారట తేజస్విని. అసలే అప్పుడు కోవిడ్ టైం. అలాంటి టైంలో ఇలా శాడ్ ఎండింగ్‌తో సినిమాను ప్రేక్షకులు ఎంకరేజ్ చేయరని ఆమె ఫీల్ అయ్యారట. దిల్ రాజు ఆ సినిమా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. ఆమె అదే విషయాన్ని చెప్పేవారట. కానీ కట్ చేస్తే.. దిల్ రాజు జడ్జిమెంట్ నిజమయింది. సినిమా విడుదలయ్యాక.. ప్రతి మనసును తాకి.. సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణుతో ఎల్లమ్మ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమాతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అటు భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తూ.. ఇటు చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తూ కంటెంట్‌పై తన అభిరుచిని చాటుకుంటున్నారు దిల్ రాజు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..