
ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు వైష్ణవి చైతన్య. ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకుంది తెలుగమ్మాయి. ట్రైయాంగిల్ ప్రేమకథగా వచ్చిన బేబి సినిమా హిట్ తో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించగా..వైష్ణవి కథానాయికగా మెప్పించింది. ఈ ముగ్గురి నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే ఈ సినిమాలో వైష్ణవి, ఆనంద్ నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. డైరెక్టర్ సాయిరాజేష్ తెరకెక్కించిన బేబి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. యువత నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బేబీ హిట్ తో వైష్ణవికి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగమ్మాయికి ఛాన్స్ ఇచ్చేందుకు మేకర్స్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక యంగ్ హీరోస్ ప్రాజెక్ట్స్ కోసం వైష్ణవి పేరునే ముందుగా పరిశీలిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.తాజాగా ఈ బ్యూటీకి లక్కీ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా ఆమె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో అవకాశం అందుకుందని టాక్. మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యింది.
ఇక ఈ సినిమాలో రామ్ జోడిగా వైష్ణవిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఒక కథానాయికగా వైష్ణవిని ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.