ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయ్యారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో ఈ ముగ్గురి నటన ప్రేక్షకులను కంటతడి పెట్టింది. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకు ఈ మూవీ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈసినిమా ఇప్పుడు ఓటీటీ మధ్యామం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇటు ఓటీటీలోనూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ వేదికపై బేబీ సినిమాకు విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ మాధ్యామం ఆహ.. వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్య ఓ వీడియోను పంచుకుంది. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు వైష్ణవి తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చింది.
ఆనంద్, విరాజ్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటావు ?. అని అడగ్గా.. ఇద్దరినీ కాదు అంటూ చెప్పేసింది. కానీ ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ తనకు నచ్చుతుందని తెలిపింది. అలాగే బేబీ సినిమాలో వైష్ణవి చేసింది కరెక్టేనా ? అని అడగ్గా.. ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు అంటూ మనకి మనం రూల్స్ పెట్టుకోలేం కదా.. ఆ పాత్ర తీరును బట్టి ఆ సమయంలో ఏం అనిపిస్తే వైష్ణవి అది చేసిందని చెప్పుకొచ్చింది. ఇక తనకు వైష్ణవి పాత్ర చాలా నచ్చిందని తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్ బేబీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్లో ఫేమస్ అయిన వైష్ణవి.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటించింది. మొదటిసారిగా కథానాయికగా నటించిన బేబీ చిత్రం. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ తెలుగమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకోనున్నట్లు తెలుస్తోంది.
This baby is killi’n it in reel and real! 💁🏼♀ @iamvaishnavi04 for Y’all🔥
Cult love story of the decade #Baby is streaming now on aha🧡 ▶https://t.co/nOLR0736rh pic.twitter.com/6pZnEy21S2— ahavideoin (@ahavideoIN) August 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.