ఆ రోజు నన్ను చంపాలనుకున్నారు.. ఒక్క క్షణం ఆలస్యమైనా అంతా అయిపోయేది

బాబు మోహన్, నటుడిగా, రాజకీయ నాయకుడిగా తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కీలక సంఘటనలను పంచుకున్నారు. ఒకానొక దశలో తనన యూ చంపాలనుకున్నారని, ఒక పోలీసు అధికారి తనను హెచ్చరించడం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించుకున్నానని వెల్లడించారు. ఈ సంఘటనలన్నీ ఆయన మంత్రి పదవిలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నాయన్నారు.

ఆ రోజు నన్ను చంపాలనుకున్నారు.. ఒక్క క్షణం ఆలస్యమైనా అంతా అయిపోయేది
Babu Mohan

Updated on: Aug 19, 2026 | 1:18 PM

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్, తన జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన, కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పాన్ తినే వ్యసనం, దాని వెనుక ఉన్న కథ, విష ప్రయోగం నుంచి ఎలా బయటపెట్టారు. బాబూమోహన్ మాట్లాడుతూ.. తన స్నేహితుడు, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో ఉన్న సాన్నిహిత్యం గురించి చెబుతూ, భరణిని “గాడిద”, “అన్-ఎడ్యుకేటెడ్ ఫెలో” అని సరదాగా పిలుస్తానని అన్నారు. భరణి పదే పదే అడగడంతో ఒకరోజు పాన్ తినడం ప్రారంభించిన బాబు మోహన్, క్రమంగా రోజుకు 30 పాన్‌లు తినే స్థాయికి అలవాటు పడ్డారట. ఈ వ్యసనం ఎంతలా పెరిగిందంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట కూడా పాన్ తినడానికి సంకోచించనంతగా మారిందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఈ పాన్ వ్యసనం ఒకానొక దశలో ఆయన ప్రాణాలకే ప్రమాదంగా మారింది. ఒక ఎస్.పి. అధికారి బాబు మోహన్‌ను హెచ్చరిస్తూ.. నక్సల్స్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఉండమని చెప్పారట. తనని చంపడానికి రికీ జరుగుతోందని తెలిపారట.. అయితే కొద్ది రోజుల తర్వాత, అదే ఎస్.పి. ఫోన్ చేసి, తాను కొన్న పాన్‌లో విషం కలిపారని, వెంటనే పడేయమని సూచించారు. అప్పటికే సంగారెడ్డి దాటుతున్న బాబు మోహన్, చేతిలో ఉన్న పాన్‌ను పట్టుకునే ఉన్నారట. వెంటనే మరొక ఫోన్ కాల్ వచ్చింది, అందులో ఒక ముస్లిం పాన్ అమ్మే వ్యక్తి అందులో విషం ఉంది అని చెప్పడంతో, బాబు మోహన్ ఆ పాన్‌ను పడేసి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారట. ఈ సంఘటన తర్వాత, ఆయన మళ్ళీ పాన్ ముట్టుకోలేదు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

మరొక ముఖ్యమైన సంఘటనను వివరిస్తూ, ఒకసారి ఢిల్లీ నుండి ఒక మంత్రి వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు బాబు మోహన్‌ను ఆ మంత్రిని ఇంటికి భోజనానికి తీసుకురావాలని కోరారు. భోజనం అనంతరం చంద్రబాబు నాయుడు, బాబు మోహన్, ఢిల్లీ మంత్రి కూర్చున్నారట. చంద్రబాబు నాయుడు బాబు మోహన్ వైపు చూస్తూ, పాన్ తినడం మానేశావా అని అడిగారు. అప్పటివరకు అలవాటుగా చంద్రబాబు నాయుడు ఎదురుగా కూడా పాన్ తినే బాబు మోహన్, ఇప్పుడు వద్దు సార్ అని చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారట. తన మంత్రి పదవి పీకేస్తారేమోనన్న భయంతోనే తాను పాన్ మానేశానని, తప్పు చేసిన వారిని పదవి నుండి తొలగిస్తారు కదా సార్ అని చెప్పడంతో, చంద్రబాబు నాయుడు నవ్వు ఆపుకోలేకపోయారట. గంట సేపు  చంద్రబాబు నాయుడు నవ్వుకున్నారని తెలిపారు బాబూమోహన్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us