AyPilla Musical Preview : “ముద్దు పెడితే ఏడుస్తారా”

|

Feb 14, 2020 | 3:25 PM

AyPilla Musical Preview: కింగ్ నాగార్జునకు రొమాంటిక్ హీరో అనే పేరుంది. ఈ ట్యాగ్ ఆయన తండ్రి ఏఎన్నార్ నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. ఎన్నో లవ్ సినిమాలతో అమ్మాయిల్లో తనకంటూ సపరేట్ ట్రెండ్ చేసుకున్నాడు నాగ్. 60 ప్లస్‌లోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో సరసాలకు ఏ మాత్రం తక్కువ చెయ్యలేదు. నిన్న మొన్న వచ్చిన ‘మన్మథుడు 2’ మూవీలోనూ అదే రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఇక త్వరలోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ మూవీ ‘బంగార్రాజు’తో మరోసారి వెండితెరపై రోమాన్స్ […]

AyPilla Musical Preview : ముద్దు పెడితే ఏడుస్తారా
Follow us on

AyPilla Musical Preview: కింగ్ నాగార్జునకు రొమాంటిక్ హీరో అనే పేరుంది. ఈ ట్యాగ్ ఆయన తండ్రి ఏఎన్నార్ నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. ఎన్నో లవ్ సినిమాలతో అమ్మాయిల్లో తనకంటూ సపరేట్ ట్రెండ్ చేసుకున్నాడు నాగ్. 60 ప్లస్‌లోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో సరసాలకు ఏ మాత్రం తక్కువ చెయ్యలేదు. నిన్న మొన్న వచ్చిన ‘మన్మథుడు 2’ మూవీలోనూ అదే రేంజ్‌లో రెచ్చిపోయాడు. ఇక త్వరలోనే ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ మూవీ ‘బంగార్రాజు’తో మరోసారి వెండితెరపై రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక తాత, తండ్రులకు తగ్గట్టుగానే అక్కినేని నాగచైతన్య కూడా రొమాంటిక్ హీరో అని బిరుదు తెచ్చుకున్నాడు. అదేంటో చైతూ ఎప్పడు మాస్ చేసినా ప్రేక్షకులు రిజక్ట్ చేశారు. లవ్ సినిమా చేస్తే అక్కున చేర్చుకుంటున్నారు.

తాజాగా చైతూ, సాయిపల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రంలోని  ‘ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సెన్సుబుల్ డైరెక్టర్ అనే ట్యాగ్‌కి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు కమ్ముల. వీడియో హృద్యంగా మనసును తాకుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది. వీడియో చివర్లో పల్లవి..చైతూకి ముద్దిచ్చినప్పడు అతడిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ జస్ట్ ఆసమ్. ముద్దు పెడితే ఏడుస్తారా అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ మెస్మరైజ్ చేస్తోంది. ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్ కన్పామ్ చేశారు.  నారాయణ దాస్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తోన్న ఈ మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.