Comedian AVS Daughter: నాన్న సర్జరీ.. మాకు తెలియకుండానే ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు: ఏవీఎస్ కూతురు

టాలీవుడ్ దిగ్గజ కమెడియన్లలో ఏవీఎస్ ది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. ఒక రంగ స్థలం కళాకారుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా,నటుడిగా.. ఇలా విభిన్న రంగాల్లో సాగింది. తెలుగులో వందలాది సినిమాల్లో నటించారాయన. కమెడియన్ గా, సహాయక నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు.

Comedian AVS Daughter: నాన్న సర్జరీ.. మాకు తెలియకుండానే ఆ స్టార్ హీరో ఆస్పత్రి బిల్లు కట్టేశారు: ఏవీఎస్ కూతురు
Comedian Avs Daughter

Updated on: Nov 25, 2026 | 5:45 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటిన గొప్ప కమెడియన్స్ లో ఏవీఎస్ ఒకరు. ఈ నటుడి పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం.
రంగస్థలం కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా,నటుడిగా, కమెడియన్ గా, దర్శకుడిగా.. ఇలా ఎన్నో విభిన్నమైన రంగాల్లో సత్తా చాటారాయన. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన బాడీ లాంగ్వేజ్, స్వరంతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. 1993లో మిస్టర్ పెళ్ళాం మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు ఏవీఎస్ . ఆ తర్వాత శుభలగ్నం, యమలీల, మాయాబజార్, వినోదం, శ్రీమతి వెళ్లోస్తా, వెంకీ, మా అన్నయ్య, పెళ్లి సందడి.. ఇలా ఎన్నో వందలాది సూపర్ హిట్ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు ఏవీఎస్. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, దర్శకుడిగానూ సత్తాచారాయన. అయితే నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే కాలేయ సమస్యల బారిన పడ్డారు ఏవీఎస్. ఇందుకోసం చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. చివరకు ఆయన కూతురు శాంతి కూడా ఏవీఎస్ కు కాలేయం ఇచ్చింది. అయినా ఆయన 57 ఏళ్లకే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఏవీఎస్ సర్జరీ, ట్రీట్మెంట్ గురించి గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకన్నారు కూతురు శాంతి.

‘నేను ఆ సమయంలో చాలా చబ్బీగా ఉండేదాన్ని. దీంతో నాకు ఫ్యాటీ లివర్ ఉంటుందేమో అనే సందేహంతో డాక్టర్ వద్దు అన్నారు. డోనర్ కోసం వేరేవారిని ప్రయత్నించండి అని సూచించారు. నాన్నను బ్రతికించుకునేందుకు ఏ ఛాన్స్ కూడా నేను వదులుకోదలుచుకోలేదు. సర్ నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఒక్కసారి టెస్టులు చేయండి.. అప్పటికీ నా లివర్ కుదరదు అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పా. నేను రిక్వెస్ట్ చేయడంతో డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేశారు. ఉహించని విధంగా నాకు ఎలాంటి సమస్యలు లేదు.. నా లివర్ 100 పర్సెంట్ హెల్దీ గా ఉంది. దీనితో డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటికి నాకు పెళ్లయింది. కావాలంటే నా భర్త, అత్త మామలు అభ్యంతరం చెప్పొచ్చు. కానీ వాళ్లు ఏమాత్రం ఆలోచించకుండా మీ నాన్నకు లివర్ ఇవ్వు అని ఎంకరేజ్ చేశారు. నిజం చెప్పాలంటే వాళ్ల సపోర్ట్ లేకుంటే నాకు ఆ పని సాధ్యం అయ్యేది కాదు. 2008లోనే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి 65 లక్షలు ఖర్చయింది. అప్పటికి నాన్నగారు ఆర్థికంగా ఒక పోజిషన్ లోనే ఉన్నారు. అయితే నాన్న పరిస్థితి తెలుసుకుని సహాయం చేసేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు. మొదట మురళి మోహన్ అంకుల్ ముందుకు వచ్చారు. ఇక నాన్నకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మంచి అనుబంధం ఉంది. చిరంజీవి గారు హాస్పిటల్ కి వచ్చి గంటకు పైగా సమయం గడిపి ఆస్పత్రి బిల్ కోసం కొంత మొత్తం సాయం చేసి వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే నాన్నని చూసి మాకు చెప్పకుండానే హాస్పిటల్ బిల్ కొంత కట్టేసి వెళ్లిపోయారు’ అని అన్నారు. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us