Teddy Movie Trailer: ఆకట్టుకుంటున్న హీరో ఆర్య ‘టెడ్డి’ ట్రైలర్… అనుక్షణం ఉత్కంఠభరింతగా..

|

Feb 24, 2021 | 1:25 PM

తమిళ స్టార్ హీరో ఆర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వరుడు, రాజారాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆర్య. ప్రస్తుతం ఈ హీరో

Teddy Movie Trailer: ఆకట్టుకుంటున్న హీరో ఆర్య టెడ్డి ట్రైలర్... అనుక్షణం ఉత్కంఠభరింతగా..
Follow us on

తమిళ స్టార్ హీరో ఆర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వరుడు, రాజారాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఆర్య. ప్రస్తుతం ఈ హీరో ‘టెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆర్యకు జోడీగా ఆయన సతిమణి సాయేషా నటిస్తున్నారు. మెడికల్ మాఫియా, సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శక్తి సుందర్ రాజన్ దర్శకత్వం వహించారు. తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన టెడ్డి సినిమాలో ఆర్య నటన ఆక్టట్టుకుంటుంది. కోమా స్టేజ్‏లో జీవితానికి, మరణానికి మధ్య ఉండే కొంతమంది తమ శరీరంలో నుంచి బయటకు వచ్చి తమని తాము చూసుకోగలుగుతారు అంటూ సాగిన ఈ వీడియోను ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. ఈ సినిమా మార్చి 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో విడుదల కానుంది.

Also Read:

ఒక్కోపాత్రలో విభిన్న కోణాలు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..