
అనుష్క సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. దాదాపు ఐదేళ్ల తర్వాత అనుష్క ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన అనుష్క. ఆ తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించారు. బాహుబలి సినిమాతర్వాత అనుష్క నటించిన సినిమా భాగమతి ఓకే అనిపించుకుంది. ఆతర్వాత వచ్చిన నిశ్శబ్దం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో చాలా గ్యాప్ తీసుకున్నఅనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ గా కనిపించనున్నారు. అలాగే నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా హిట్ పై చిత్రయూనిట్ అంతా ధీమాగా ఉన్నారు.
ఇక ఈ మూవీ ప్రమోషన్ బాధ్యత మొత్తం హీరో నవీన్ పోలిశెట్టి తీసుకున్నారు. ఆయన ఒకొక్కడే ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. పలు నగరాలకు వెళ్తూ అభిమానులను కలుస్తున్నారు. అలాగే పలు టీవీ షోల్లో కూడా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు నవీన్. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి.. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ కొత్త కాన్సెప్ట్ తో నేనెప్పుడూ చేయని పాత్రతో వస్తున్నాను. ఈ మూవీ నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను అని అన్నారు. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ ఎప్పుడు ఒకేలా ఉన్నాడు, 2005 నుంచి నాకు ప్రభాస్ తెలుసు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నారు అని చెప్పుకొచ్చారు అనుష్క. ఆయన తనకు వెరీ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్.. అప్పటికి నాకు ప్రభాస్ ఇదే అన్నారు అనుష్క.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..