
బాహుబలి తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) సినిమాలకు దూరంగా ఉంటుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సినిమాలో అనుష్క కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇందులో అనుష్క మరోసారి సైజ్ జీరో లుక్ లో కనిపించనుందని టాక్.
ఈ సినిమాలో మరోసారి అనుష్క కాస్త బొద్దుగా కనిపించనుందట. కథ డిమాండ్ చేయడంతో డైరెక్టర్ మహేష్ . పి చెప్పినట్లు అనుష్క తన శరీరాకృతిని మార్చుకుంటున్నారని.. ఇప్పటికే ఆమె బరువు పెరిగిందని.. అందుకే సోషల్ మీడియాలో తన ఫోటోస్ షేర్ చేయడంలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో అనుష్క లుక్ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వర్క్ పట్ల ఆమె డెడికేషన్‌కు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం లుక్ మార్చుకోవద్దంటూ సలహాలు ఇస్తున్నారు. గతంలో సైజ్ జీరో సినిమా కోసం అనుష్క దాదాపు 20 కిలోల బరువు పెరిగింది. నటన కోసం తన శరీరాకృతి మార్చుకోవడానికి ఆమె ఎప్పుడు ముందుంటారు. ఇక ఇటీవలే సినీ పరిశ్రమలోకి కథానాయికగా అనుష్క ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.