పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు.. నామీద నాకే అసహ్యం కలిగింది

ఆ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ , ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల్నిఅలరించారు. అయితే , ఇటీవల అనుపమ తన పర్సనల్ లైఫ్ లో జరిగిన బ్రేకప్ కి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్నారు .

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు.. నామీద నాకే అసహ్యం కలిగింది
Anupama Parameswaran

Updated on: Aug 19, 2026 | 11:04 AM

రీసెంట్ డేస్ లో అనుపమ పరమేశ్వరన్ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది. హీరోయిన్ గా సినిమా చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన రిలేషన్ షిప్ వార్తలతో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి ప్రస్తావించింది. ఒక తమిళ ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ ప్రియుడు, ధృవ్ విక్రమ్ గురించి, వారి రిలేషన్ షిప్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అనుపమ, ధృవ్ ఇద్దరూ దాదాపు రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి బైసన్ అనే సినిమాలో నటించారు. అనుపమ, ధృవ్ విక్రమ్ తో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని, అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ అది అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

అయితే ధృవ్ తనని చాలా కంట్రోల్ చేసేవాడని , ఒకరోజు రెమోలా, మరోరోజు అపరిచితుడిలా బిహేవ్ చేసేవాడని అనుపమ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే, తను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయాలి అనే విషయాల్లో కూడా ధృవ్ చెప్పేవాడని ఆమె చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా అదే ఇంటర్వ్యూకి సంబందించిన రెండో భాగాన్ని విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన రిలేషన్ గురించి మరిన్ని విషయాలు పంచుకుంది అనుపమ. నేను ఒక యాక్టర్ ని, లైఫ్ లో చాలా దైర్యంగా ఉంటాను అలాంటి నన్ను చాలా ఇబ్బందిపెట్టాడు. ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి అతను నన్ను నెట్టేశాడు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

నేను ఏది మాట్లాడిన.. అతని తప్పులను ప్రస్తావించినా.. లేదా ప్రశ్నించినా.. నీకు పీరియడ్స్ వచ్చాయా.? లేదా నీకు ఇంకా డేట్ రాలేదా.? మూడ్ స్వింగ్స్‌ కదా అంటూ తక్కువ చేసి మాట్లాడాడు. ఆ మాటలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. నామీద నాకే అసహ్యం కలిగేలా చేశాయి. ఒకప్పుడు నేను 11 మంది పిల్లలను కనాలి అని కలలు కన్నాను. కానీ ఇప్పుడు అసలు పిల్లలే వద్దు అనే స్థాయికి వచ్చాను.. ఒక అమ్మాయిగా పుట్టినందుకే నేను ఇన్ని మాటలు పడాలా అనిపించింది. అంటూ అనుపమ చెప్పుకొచ్చింది. దీంతో అనుపమ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు, ధృవ్ పైకి కనిపించేంత మంచివాడైతే కాదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us