Anupama: నిఖిల్‌తో ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న అందాల అనుపమ.. హిట్‌ సినిమా సీక్వెల్‌లో..

Anupama Acting with Nikhil: కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. గ్లామర్‌ పాత్రలకు వీలైనంత దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లో నటిస్తూ.. దూసుకెళుతోంది...

Anupama: నిఖిల్‌తో ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న అందాల అనుపమ.. హిట్‌ సినిమా సీక్వెల్‌లో..

Updated on: Feb 24, 2021 | 8:11 AM

Anupama Acting with Nikhil: కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. గ్లామర్‌ పాత్రలకు వీలైనంత దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లో నటిస్తూ.. దూసుకెళుతోంది. తన అందం, అభినయంతో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది బ్యూటీ.
ఇక అనుపమ తాజాగా తెలుగులో నిఖిల్‌ సరసన ’18 పేజెస్‌’ అనే చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ను నిర్మాత అల్లు అరవింద్‌ అధికారికంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తి కాకముందే నిఖిల్‌తో మరో సినిమాలో నటించేందుకు అనుపమ అంగీకారం తెలిపింది. తాజా నిఖిల్‌ హీరోగా తెరకెక్కనున్న కార్తికేయ సినిమా సీక్వెల్‌లో అనుపమ నటిస్తోంది. ఈ సినిమా మొదటి పార్ట్‌లో నటించిన స్వాతి తన క్యూట్‌ నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రకు అనుపమ అయితేనే సెట్‌ అవుతుందని భావించిన చిత్ర యూనిట్‌ ఇందుకోసం ఆమెను తీసుకుంది. నిజానికి ఈ సీక్వెల్‌కు సంబంధించి ఎప్పుడో ప్రకటన వచ్చినా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్ట కేలకు ఈ సినిమా షూటింగ్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 26) నుంచి మొదలు పెట్టనున్నారు. ఇక 2014లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు, సైన్స్‌ అంశాలను దర్శకుడు చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు.

Also Read: పాస్టర్ మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి.. బాధితురాలికి అండగా నిలిచిన నటి కరాటే కల్యాణి..