Anukreethy Vas: “హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే ముందు అదే అడుగుతున్నారు”.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ అవకాశాలు కొంతమందిని వెత్తుకుంటూ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. అలా సోషల్ మీడియా పుణ్యమా అని ఛాన్స్ కు అందుకున్న ముద్దుగుమ్మతో అనుకీర్తి వాస్ ఒకరు. ఈ భామ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. మిస్‌ ఇండియా కిరీటం కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నది. దాంతో ఈ బ్యూటీకి హీరోయిన్ గా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Anukreethy Vas: హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే ముందు అదే అడుగుతున్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Anukreethy Vas

Updated on: Nov 08, 2023 | 5:27 PM

ఒకప్పుడు హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడేవారు. ఆడిషన్స్ అంటూ ప్రొడ్యూసర్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ అవకాశాలు అందుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్ అవకాశాలు కొంతమందిని వెత్తుకుంటూ వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మందికి సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. అలా సోషల్ మీడియా పుణ్యమా అని ఛాన్స్ కు అందుకున్న ముద్దుగుమ్మతో అనుకీర్తి వాస్ ఒకరు. ఈ భామ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. మిస్‌ ఇండియా కిరీటం కూడా సొంతం చేసుకుంది ఈ చిన్నది. దాంతో ఈ బ్యూటీకి హీరోయిన్ గా అవకాశాలు క్యూ కడుతున్నాయి. తమిళ్ లో సినిమాలు చేసి మెప్పించింది ఈ చిన్నది. విజయ్‌ సేతుపతికి జంటగా డీఎస్పీఅనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. ఆ సినిమానే మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో నటించి మెప్పించింది ఈ చిన్నది. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం వెట్ట్రి  అనే సినిమాలో నటిస్తుంది అనుకీర్తి వాస్.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది అనుకీర్తి వాసి. తన పర్సనల్ విషయాలతో పాటు తన సినిమా అప్డేట్స్ ను పంచుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం చాలా మారిపోయింది అని అంటుంది. ఐదేళ్ల క్రితం సోషల్ మీడియా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీని వాడకం పెరిగిపోయింది. ఇప్పుడు తనకు సినిమా అవకాశాలు వస్తే ముందు తన ఇన్ స్టా గ్రామ్ ఐడీని పంపమని అడుగుతున్నారని, దాన్ని చూసే తనను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారని తెలిపింది. అందుకే తన వ్యక్తిగత విషయాలను.. తనకు సంబంధించిన ప్రతివిషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా అని తెలిపింది అనుకీర్తి వాస్.

అనుకీర్తి వాస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.