Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

|

Jul 30, 2024 | 10:05 AM

తన చలాకీ మాటలతో అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది విష్ణు ప్రియా. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే ఫోటోలు సెగలు పెట్టిస్తున్నాయి.

Vishnu Priya : నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!
Vishnu Priya
Follow us on

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత యాంకర్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ విష్ణు ప్రియా. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన పోరా పోవే అనే కార్యక్రమానికి యాంకర్ గా చేసింది. ఈ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది. తన చలాకీ మాటలతో అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది విష్ణు ప్రియా. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసే ఫోటోలు సెగలు పెట్టిస్తున్నాయి. తన అందాలతో మతిపోగొడుతోంది విష్ణు ప్రియా.

ఇది కూడా చదవండి :Tanushree Dutta: వాళ్లు ఆ పని చేయొచ్చు.. కానీ నేను చేస్తే తప్పా..! తను శ్రీ కామెంట్స్ 

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ప్రియా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే బిగ్ బాస్ ఎంట్రీ పై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 8కు విష్ణు ప్రియా వెళ్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి . దీని పై అడిగిన ప్రశ్నకు దాదాపు అవును అనే సమాధానం చెప్పింది అలాగే తన ఫ్రెండ్ రీతూ చౌదరి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి :Shree Rapaka: నేను దుస్తులులేకుండా కనిపిస్తే ఆ దర్శకుడు ఊరుకుంటాడా..? శ్రీ రాపాక సెన్సేషనల్ కామెంట్స్

విష్ణు ప్రియా, రీతూ చౌదరి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్.. ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో వీడియోలు , ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అలాగే కలిసి వెకేషన్స్ కూడా వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా కిరాక్ బాయ్ కిలాడీ లేడీస్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ షోలో ఇద్దరికీ కలిపి రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారా లేక విడి విడిగా అడిగారా అనే ప్రశ్నకు రీతూ సమాధానం ఇస్తూ.. సెపరేట్ సెపరేట్ పేమెంట్స్‌యే.. ఇద్దరినీ విడివిడిగా అప్రోచ్ అయ్యారు అని చెప్పింది. కానీ విష్ణు ప్రియా వెటకారంగా మాట్లాడుతూ.. రీతూ గారు అంటే చాలా ఫెమస్ .ఇన్ స్టాలో ఎక్కడ చూసిన ట్రెండింగ్ లో ఉంటుంది అందుకనే రీతూ అనే గొప్ప పీస్‌ను ఎంచుకున్నారు..నేను తుప్పుపట్టిపోయిన పీస్. చాలారోజులైంది నేను తప్పుపట్టి తక్కువలో వస్తుందని నన్ను షోకు పిలిచారు అని ఫన్నీగా చెప్పుకొచ్చింది విష్ణు ప్రియా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విష్ణు ప్రియా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రీతూ చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి