Suma Kanakala: యాంకరింగ్‌కు సుమ వీడ్కోలు పలకనుందా? ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన స్టార్‌ యాంకర్‌

|

Dec 28, 2022 | 1:22 PM

న్యూ ఇయర్‌ సందర్భంగా ఇటీవల విడుదలైన ఓ ప్రోమోలో ఎమోషనల్‌గా మాట్లాడిన సుమ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని అభిమానించారని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Suma Kanakala: యాంకరింగ్‌కు సుమ వీడ్కోలు పలకనుందా? ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసిన స్టార్‌ యాంకర్‌
Suma Kanakala
Follow us on

గత రెండు రోజులుగా స్టార్‌ యాంకర్‌ సుమ గురించి కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె యాంకరింగ్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్‌ సందర్భంగా ఇటీవల విడుదలైన ఓ ప్రోమోలో ఎమోషనల్‌గా మాట్లాడిన సుమ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని అభిమానించారని సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కొంతకాలం యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత షోకు హాజరైన ఆర్టిస్టులు స్టార్‌ యాంకర్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే సుమ యాంకరింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుంటుందా? బజ్‌ కోసమే ఇలా చేస్తున్నారా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై రకరకాల కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన సుమ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

‘హలో.. రీసెంట్‌గా ఓ న్యూఇయర్ ఈవెంట్ చేయడం జరిగింది. దాని ప్రోమో కూడా రిలీజ్ చేశాం. ఇప్పుడు అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో నేను ఎమోషనల్ అయినటువంటి మాట వాస్తవమే. కానీ ఈవెంట్‌ అంతా చూస్తే అసలు విషయం ఏంటో మీకు అర్థమవుతుంది. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మెసెజ్‌లు చేస్తున్నారు. నేను బుల్లితెర కోసమే పుట్టాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఉన్నాను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని అందులో చెప్పుకొచ్చింది సుమ. అయితే ఈ వీడియోను షేర్‌ చేసిన కొద్ది సేపటికే ట్వీట్‌ను డిలీట్ చేసిందీ స్టార్‌ యాంకర్‌. ఎందుకు అలా ట్వీట్‌ను డిలీట్ చేసింది అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే అప్పటికే కొందరు వీడియో స్ర్కీన్‌షాట్లను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..