Rashmi Gautam: నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. హాట్‌ టాపిక్‌గా యాంకర్ రష్మీ పోస్ట్ .. ఏం జరిగిందంటే?

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యలపై తన దైన శైలిలో గళం విప్పుతుంటుంది. అలా తాజాగా నేను మోడీకే సపోర్ట్ చేస్తానంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Rashmi Gautam: నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. హాట్‌ టాపిక్‌గా యాంకర్ రష్మీ పోస్ట్ .. ఏం జరిగిందంటే?
Rashmi Gautam

Updated on: May 12, 2026 | 2:11 PM

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెర పై ఉన్న టాప్ యాంకర్లలో ఆమె కూడా ఒకరు. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టాప్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది రష్మీ. ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోందీ అందాల తార. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. యాంకర్ రష్మీ గౌతమ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యలపై తన దైన శైలిలో గళం విప్పుతుంటుంది. అలా తాజాగా రష్మీ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘అవును, నేను బీజేపీకి, మోదీ జీకి మద్దతు ఇస్తాను. రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు. అలాగే, బూతులతో కూడిన పోస్టులకు నేను స్పందించను లేదా రిప్లై ఇవ్వను. ఈ విషయాన్ని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. నేను సమస్యలపై కేవలం సానుభూతి మాత్రమే చూపగలను. కానీ వాటన్నిటి పరిష్కారం కోసం పోరాడే శక్తి నాకు లేదు. కానీ, గొంతులేని మూగజీవాల కోసం నేను నిరంతరం అండగా ఉంటాను’

‘మానవ సంబంధిత సమస్యలను ప్రశ్నించడానికి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే నేను జంతువుల సంరక్షణకే నా ప్రాధాన్యత ఇస్తాను. నేను గొంతులేని వారికి అండగా నిలబడతాను. వారికి నిరంతరం సహాయం చేస్తాను. అండగా ఉంటాను. నన్ను దూషించడంలో మీ శక్తిని వృధా చేయకండి. అదే ఎనర్జీని సరైన వ్యక్తులను (ప్రభుత్వం & న్యాయవ్యవస్థ) ట్యాగ్ చేయడానికి, వారి నుండి న్యాయం కోరడానికి ఉపయోగించండి. నేను పోస్ట్ చేయడం వల్ల ఎలాంటి మార్పు రాదు. నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా ఉండొచ్చు కానీ, దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.’ అని తన పోస్టులో రాసుకొచ్చింది రష్మీ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ గౌతమ్ ట్వీట్ ఇదిగో..

యాంకర్ రష్మీ ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు కానీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోన్న ఓ కేసు గురించే ఆమె ఇలా స్పందించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us