
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వారణాసి. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం మహేష్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. అదెంటంటే.. సాధారణంగా మహేష్ బాబు ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. కేవలం సినిమా ప్రమోషన్స్ సమయంలో మాత్రమే మాట్లాడుతుంటారు. మిగతా సందర్భాల్లో అసలు కనిపించరు. కానీ మహేష్ ఇంటర్వ్యూ అంటే ఓ యాంకర్ ఉండాల్సిందే. అతడితో మాత్రమే ఆయన కంఫర్టబుల్ గా మాట్లాడుతుంటారట. అతడు మరెవరో కాదు.. ప్రదీప్ మాచిరాజు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో తనకున్న మెమొరబుల్ మూమెంట్ షేర్ చేసుకున్నారు. యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. తన మొదటి టీవీ షోకు మహేష్ బాబు హాజరు కావడంతో ప్రారంభమైన బంధం.. తన కెరీర్ లో కీలక మలుపులు తిరిగిందని అన్నారు. మహేష్ బాబు వంటి అగ్ర నటుడిని ఒప్పించడం కష్టమని మొదట భావించినా, ఆయన ఒప్పుకున్న వెంటనే ప్రదీప్ ఎంతో ఆనందించారట. షో షూటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. మహేష్ బాబు సమయ పరిమితులను దృష్టిలో ఉంచుకొని, పార్క్ హయత్ హోటల్‌లో ప్రత్యేకంగా ఒక కాన్ఫరెన్స్ హాల్‌ను తీసుకొని, రాత్రికి రాత్రే ఒక కొత్త సెట్‌ను నిర్మించారట. షూటింగ్ ప్రారంభం ముందు వరకు మహేష్ ఎలా ఉంటారో అనుకున్నానని.. తర్వాత మాట్లాడుతుండగానే ఎంతో సరదాగా గడిపారని అన్నారు. కేవలం సినిమా పాత్రలలో మాత్రమే కాకుండా, నిజ జీవితంలోనూ ఆయనకు అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ప్రదీప్ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఈ మొదటి షో తర్వాత, మహేష్ బాబుతో తన అనుబంధం మరింత బలపడిందని అన్నారు. భరత్ అనే నేను సినిమా సమయంలోనూ తన ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా పిలిపించారని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. అది మహేష్ బాబు తనపై పెట్టుకున్న నమ్మకానికి రుణపడి ఉంటానని అన్నారు. విజయవాడలో జరగాల్సిన ఒక ఈవెంట్ సందర్భంలో, మహేష్ బాబు యాంకర్‌గా ప్రదీప్ ఉండాలని స్వయంగా కోరారని.. అంతేకాకుండా మహేష్ బాబుతో కలిసి తాను కూడా తీసుకెళ్లారని అన్నారు. మహేష్ బాబు ప్రదీప్‌ను తనతో పాటు చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణించమని అడిగారని.. ఈ అద్భుతమైన అవకాశం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మిగిలిందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..