Anasuya: హీరోయిన్‏కు తల్లిగా అనసూయ.. ఆ స్టార్ హీరో సినిమాలో యాంకరమ్మ ఛాలెంజింగ్ రోల్..

|

Feb 03, 2022 | 7:30 AM

యాంకర్ అనసూయ (Anasuya).. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఓవైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై తన నటనతో దూసుకుపోతుంది.

Anasuya: హీరోయిన్‏కు తల్లిగా అనసూయ.. ఆ స్టార్ హీరో సినిమాలో యాంకరమ్మ ఛాలెంజింగ్ రోల్..
Anasuya
Follow us on

యాంకర్ అనసూయ (Anasuya).. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఓవైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై తన నటనతో దూసుకుపోతుంది. ఇటీవల పుష్ప(Pushpa) సినిమాతో దాక్షాయణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ. ఈ మూవీలో అనసూయ తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. బుల్లితెరపై ఎంతో గ్లామరస్‏తో కనిపించే అనసూయ… సినిమాల్లో మాత్రం పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఢీగ్లామరస్ లుక్‏లో కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది అనసూయ. అందుకే అనసూయ కోసం ఛాలెంజింగ్ రోల్స్ ఇవ్వడానికైన దర్శకనిర్మాతలు సిద్ధపడిపోతున్నారు. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో బిజిగా ఉంది.

ప్రస్తుతం ఈ యాంకరమ్మ.. మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న ఖిలాడి సినిమాలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇద్దరు రవితేజతో ఆడిపాడనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరిలో ఒకరికి తల్లిగా అనసూయ నటిస్తోందట. అంటే రవితేజకు అత్త పాత్రలో అనసూయ కనిపించబోతుందట. ఆమె పోషించిన చంద్రకళ పాత్ర ఈ సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్, ఎల్ఎల్పీ బ్యానర్లపై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Kareena Kapoor: తన కొడుకుతో ఓ హీరో సినిమా తీస్తాడని చెప్పిన కరీనా.. ఆ హీరో ఎవరంటే..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…