Anasuya Bharadwaj: ‘బేగం హజ్రత్ మహల్’గా అనసూయ.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్వీట్..

ఓవైపు చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్న అనసూయ..ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోన తాజాగా అనసూయ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. స్వాతంత్ర సమరయోధురాలు అయిన బేగం హజ్రత్ మహల్ ఫోటోను షేర్ చేస్తూ అదే లుక్ లో ఉన్న తన ఫోటోను కూడా షేర్ చేసింది అనసూయ.

Anasuya Bharadwaj: బేగం హజ్రత్ మహల్గా అనసూయ.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ట్వీట్..
Anasuya Bharadwaj

Updated on: Aug 14, 2023 | 4:24 PM

యాంకర్ అనసూయ… తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బుల్లితెరపై యాంకరమ్మగా అలరించిన అనసూయ.. ఇప్పుడు నటిగా వెండితెరపై సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టేసింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్న అనసూయ..ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోన తాజాగా అనసూయ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. స్వాతంత్ర సమరయోధురాలు అయిన బేగం హజ్రత్ మహల్ ఫోటోను షేర్ చేస్తూ అదే లుక్ లో ఉన్న తన ఫోటోను కూడా షేర్ చేసింది అనసూయ.

“1857 కాలం నాటి స్వాతంత్ర సమరయోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హజ్రత్ మహల్ ను గుర్తుచేసుకుంటూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మర్చిపోయిన పోరాట యోధులను గుర్తుచేసుకుందాం.” అంటూ దేశం కోసం ఆమె పోరాడిన తీరుకు గుర్తుగా 1984 మే 10 ఆమె ఫోటోతో ప్రభుత్వం రిలీజ్ చేసిన స్టాంప్ ను షేర్ చేశారు. అలాగే బేగం హజ్రత్ మహల్ గా కనిపిస్తోన్న తన ఫోటోను కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అనసూయ ట్వీట్..

ఇదిలా ఉంటే.. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోదులలో మొదటి మహిళా బేగం హజ్రత్. 1856లో బ్రిటిష్ సైనికులు ఉత్తర్ ప్రదేశ్ లోని ఆవాద్ ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె ఆ ప్రాంత వ్యవహార బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆ సమయంలో బ్రిటిష్ సైనికులతో బేగం హజ్రత్ దళం తిరుగుబాటు చేసింది. 1879లో ఆమె నేపాల్ రాజధాని ఖాట్మండులో మరణించారు.

అనసూయ ఇన్ స్టా పోస్ట్..

అనసూయ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.