Anasuya Again Roped For A Special Song: న్యూస్ చానల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి అనంతరం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ అనసూయ. యాంకరింగ్‌కు సరికొత్త అర్థం చెబుతూ తన అందం, చెలాకి మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ అనంతరం సినిమా అవకాశాలు కూడా కొట్టేసింది.
ఓ వైపు సినిమాల్లో సీరియస్ సబ్జెక్ట్ ఉన్న కథల్లో నటిస్తూనే మరోవైపు అందాల ప్రదర్శనకు అవకాశముండే ప్రత్యేక గీతాల్లోనూ ఆడిపాడుతోందీ చిన్నది. ఇప్పటికే ‘విన్నర్’, ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన అనసూయ తాజాగా మరో కొత్త సినిమాలోనూ స్పెషల్ సాంగ్‌లో కాలు కదపనుందని తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కౌశిక్ దర్శకత్వంలో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ప్రత్యేక గీతంలో చిత్ర యూనిట్ అనసూయను తీసుకుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే అనసూయ కనిపించే ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది. మరి ఈ పాటతో అనసూయ ప్రేక్షకులను ఎంతలా మాయ చేస్తుందో చూడాలి.
Also Read:
Bigg Boss: ‘అతడితో ప్రేమలో ఉన్నాను’.. లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిన బిగ్‌బాస్ కంటెస్టెంట్..
‘Uppena’ Movie Update : అందమైన ప్రేమ కావ్యం నుంచి మరో మధురమైన మెలోడీ రాబోతుంది..