AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantha Sriram : ఆ ఒక్క పాటతో నా కెరీర్ మారిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు, అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. అనంత శ్రీరామ్..

తెలుగు సినిమా ప్రపంచంలో గీత రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అనంత శ్రీరామ్. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన దాదాపు 1000కి పైగా పాటలు రాసి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఎన్నో సూపర్ హిట్ పాటలు అందిస్తూ సినీ సాహిత్య ప్రియుల మనసులు గెలుచుకుంటున్నారు.

Anantha Sriram : ఆ ఒక్క పాటతో నా కెరీర్ మారిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు, అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. అనంత శ్రీరామ్..
Anantha Sriram
Rajitha Chanti
|

Updated on: May 13, 2026 | 11:55 AM

Share

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 1984, ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లాలోని దొడ్డిపట్ల గ్రామంలో జన్మించిన ఆయన.. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతుండగా, పాటలపై మక్కువతో మూడవ సంవత్సరంలోనే చదువును ఆపేసి సినీ రంగం వైపు వచ్చారు. 2005లో విడుదలైన ‘కాదంటే ఔననిలే’ చిత్రం ద్వారా గేయ రచయితగా పరిచయమయ్యారు. చిరంజీవి నటించిన ‘అందరివాడు’, ‘స్టాలిన్’ సినిమాలతో అనంత శ్రీరామ్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’, ‘చందమామ’, ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించారు. కానీ తన కెరీర్ మార్చిన పాట గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

2013 సంవత్సరంలో తనకు పెద్ద సినిమా అవకాశాలు రాలేదని, లేదా తాను రాసినవి విడుదల కాలేదని, ఆ సమయంలో కెరీర్ ఒక మందగమనంలో ఉందని తెలిపారు. ఇది తనకు నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. అయితే, ఇదే సమయంలో “ఏం సందేహం లేదు” అనే పాట విడుదలైందని, అది తన కెరీర్‌లో పెను మార్పు తీసుకువచ్చిందని అనంత శ్రీరామ్ వివరించారు. ఒక పెద్ద సినిమాలో పాట విడుదలైనప్పుడు రచయితకు ఎంతటి అద్భుతమైన స్పందన వస్తుందో, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవకాశాలు అల్లుకుంటాయో, సరిగ్గా అలాంటి అనుభవమే “ఏం సందేహం లేదు” పాట తర్వాత తనకు ఎదురైందని తెలియజేశారు. ఈ పాట విజయం తన కెరీర్‌ను మందగమనం నుండి మళ్లీ పురోగమనంలోకి నడిపించిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఈ వ్యక్తిగత అనుభవాన్ని తాను గతంలో అనేక సందర్భాల్లో పంచుకోవాలని అనుకున్నప్పటికీ వెల్లడించలేదని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీనివాస్ స్వయంగా తనను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసినందున ఈ విషయాన్ని బయటపెట్టక తప్పడం లేదని తెలిపారు. ‘గీత గోవిందం’ సినిమాలో ఒక పాట రాసినందుకు ఆయనకు రూ. 19 లక్షల రాయల్టీ చెక్ వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Follow Us