Anand mahindra: మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానంటూ..

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Anand mahindra: మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానంటూ..
Anandh Mahindra

Updated on: May 30, 2022 | 8:18 AM

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). సూపర్ స్టార్ మహేష్ బాబు.. కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. సర్కారు వారి పాట సినిమానే కాకుండా ఇందులోని సాంగ్స్ సైతం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. కళావతి, పెన్నీ, మ.. మ.. మహేష పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి మహేష్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.

ఈ సినిమాలో మహేష్ జావా బైక్ ను నడిపే కొన్ని సన్నివేశాలను క్లాసిక్ లెజెండ్స్ సహా వ్వయస్థాపకుడు అనుపమ్ తరేజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయగా.. దానిని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. ” మహేష్.. జావా కాంబో అద్భుతం. ఈ కాంబినేషన్ ను నేను ఇంతకాలం ఎలా మిస్ అయ్యానో.. ప్రస్తుతం నేను న్యూయార్క్ లో ఉన్నాను.. న్యూజెర్సీలో ఈ సినిమా ఎక్కడ ప్రదర్శితమవుతుందో అక్కడివెళ్లి చూస్తా” అని మనసులో మాట పంచుకున్నారు. ఈ సినిమా మహేష్.. కీర్తి సురేష్ పాత్రలను సరికొత్తగా డిజైన్ చేశారు డైరెక్టర్ పరశురామ్.