Baby: బాక్సాఫీస్‌ వద్ద ‘బేబీ’ ప్రభంజనం.. వర్కింగ్ డేలోనూ భారీ వసూళ్లు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

|

Jul 18, 2023 | 5:34 PM

Baby Movie Collections: చిన్న సినిమాగా విడుదలైన 'బేబీ' సినిమా బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోంది. కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా యువత బేబీ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వర్కింగ్‌ డేస్‌లోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటే బేబీ ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

Baby: బాక్సాఫీస్‌ వద్ద బేబీ ప్రభంజనం.. వర్కింగ్ డేలోనూ భారీ వసూళ్లు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Baby Movie
Follow us on

Baby Movie Collections: చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ సినిమా బాక్సాఫీస్‌ దుమ్ము దులుపుతోంది. కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా యువత బేబీ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వర్కింగ్‌ డేస్‌లోనూ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటే బేబీ ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించారు. విరాజ్‌ అశ్విన్‌ మరో కీలక పాత్రలో కనిపించాడు. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీగా జులై 14న విడుదలైన ఈ చిత్రం మొదటి 3 రోజుల్లోప్రపంచవ్యాప్తంగా రూ. 23.50 గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్స్‌ కావడం దీనికి తోడు తెలంగాణాలో బోనాలు సంబరాలు కావడంతో భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే సోమవారం కూడా బేబీ సినిమా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడిపోయాయి. ఫలితంగా సోమవారం ఒక్కరోజే ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ. 7.5 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి.

ఈక్రమంలో మొత్తం నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 31 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చాయని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ‘ఏం చెప్పాలి. మొదటి రోజు కంటే వర్కింగ్‌ డే రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి’ అని బేబీ మేకర్స్‌ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా బేబీ మూవీ స్పీడ్‌ చూస్తుంటే త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్‌లోకి ఈజీగా చేరనుంది. సాయి రాజేష్‌ డైరెక్ట్‌ చేసిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలో నాగబాబు, హర్ష సాత్విక్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించిన బేబీకి విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..