
బేబీ మూవీ.. కలెక్షన్స్‌లో దూసుకుపోవడమే కాదు.. ఎవరూ ఊహించని రేంజ్లో రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. తుఫాన్ పరిస్థితుల్లోనూ.. కిర్రాక్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంటూ పోతోంది. అందులోనూ.. ఎలాంటి డ్రాప్ లేకుండా.. ప్రతీ రోజు మినిమంలో మినిమం కోటి వసూలు చేస్తూ.. అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ ఫీట్తోనే.. తాజాగా పాన్ ఇండియన్ సూపర్ డూపర్ హిట్ అయిన కేజీఎఫ్ 2 రికార్డును బద్దలు కొట్టింది ఈ రీజనల్ అండ్ స్మాల్ మూవీ. ఎస్ ! సాయి రాజేష్ డైరెక్షన్లో.. ఆనంద్, వైష్ణవి, విరాజ్ కీ రోల్స్‌లో తెరెకెక్కిన బేబీ మూవీ.. కాంటెంప్పరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా జనాల ముందుకు వచ్చి.. కల్ట్ క్లాసిక్ హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. మీడియం రేంజ్ మూవీస్లో.. ఫాస్టెస్ట్ 50 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన మూవీగా టాలీవుడ్ హిస్టరీ కెక్కింది. 11 రోజుల్లోనే.. విజయ్ దేవరకొండ ఆల్ టైం హిట్ అర్జున్ రెడ్డి ఓవర్ ఆల్ కలెక్షన్స్‌ను బీట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా కేజీఎఫ్ స్టార్ రాఖీ భాయ్ రికార్డును కూడా… ఒక్క దెబ్బతో బద్దలు కొట్టింది.
అప్పట్లో మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 సినిమా.. రిలీజ్ అయిన దగ్గరి నుంచి 12 రోజుల పాటు వరుసగా.. దాదాపు ప్రతీ రోజు కోటి రూపాయల కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక తాజాగా బేబీ మూవీ కూడా.. డే వన్ నుంచి ఇప్పటి వరకు అంటే 13వ రోజు వరకు .. ప్రతీరోజు కోటి రూపాయలకు తగ్గకుండా కలెక్షన్స్ ను రాబడుతూ వస్తోంది. దీంతో ఈ మూవీ.. కేజీఎఫ్ 2 రికార్డును బద్దలు కొట్టినట్టైంది. అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ మరోసారి హాట్ టాపిక్‌గా కూడా మారింది.