Pushpa Movie Twitter Review: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pushpa Movie Twitter Review: బన్నీ వన్ మ్యాన్ షో.. అదిరిపోయిన పుష్ప
Pushpa

Updated on: Dec 17, 2021 | 10:20 AM

Pushpa Movie Release : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలంగాణలో కొన్ని థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలు పడ్డాయి. అలాగే ఆంధ్రాలోనూ పలు థియేటర్స్ లో బెనిఫిట్ షోలు పడ్డాయని తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్  హ్యాట్రిక్ మూవీ ఇది. అలాగే, ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడనేది మెజార్టీ నెటిజన్స్ చెప్పే మాట. అలాగే, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు. ఇక విలన్ గా ఫహద్ ఫాజిల్ , సునీల్ అదరగొట్టారన్న టాక్ వినిపిస్తుంది.