Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు మరో గౌరవం.. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘పుష్ప’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. బన్నీ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు మరో గౌరవం.. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'పుష్ప'
Pushpa 2
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 02, 2022 | 6:58 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పుష్ప(Pushpa) సినిమా ఒకటి. బన్నీ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఉరమస్ గెటప్ లో కనిపించి మెప్పించారు. బన్నీ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ఆయిన పుష్ప సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలించి. బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించగా సునీల్ మరో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే చాలా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా పుష్ప సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రీసెంట్ గా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్ బస్టర్స్’ కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బన్నీ  పోస్టర్ ను షేర్ చేస్తూ “పుష్ప-ది రైజ్: పార్ట్ 1” సినిమాను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బ్లాక్ బస్టర్ హిట్స్’ కేటగిరీలో ఎంపిక చేయబడినందుకు సంతోషిస్తున్నాము అని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి