Allu Arjun: డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్.. ఇంతకీ మ్యాటరేంటంటే..

పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ పాట తెగ వైరలవుతుంది. గతంలో శ్రీవల్లి పాటలో నడుస్తూ కాలి చెప్పు వదిలేసిన స్టెప్ ఎంతగా వైరలయ్యిందో.. ఇప్పుడు పుష్ప పాటలోని షూ స్టెప్ కూడా అంతె ఫేమస్ అయ్యింది. ఈసారి షూ స్టెప్ లో మరింత ఎనర్జీటిక్ గా కనిపించారు బన్నీ. ప్రస్తుతం షూ హుక్ స్టెప్, అలాగే గ్లాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పాటలోని కొంత ట్రాక్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ. "పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను " అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

Allu Arjun: డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్.. ఇంతకీ మ్యాటరేంటంటే..
Allu Arjun, David Warner

Updated on: May 03, 2024 | 1:15 PM

గత మూడు మూడు రోజులుగా సోషల్ మీడియాలో సెన్సెషన్ సృష్టిస్తోంది పుష్ప 2 టైటిల్ సాంగ్. మే 1న విడుదలైన ఈ పాటకు నెట్టింట అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎప్పటిలాగే మరోసారి మాస్ బీట్‏తో అదరగొట్టాడు దేవి. ఇక పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మ్యానరిజం.. డాన్సింగ్ స్టైల్ అభిమానులను ఊర్రూతలుగించింది. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ పాట తెగ వైరలవుతుంది. గతంలో శ్రీవల్లి పాటలో నడుస్తూ కాలి చెప్పు వదిలేసిన స్టెప్ ఎంతగా వైరలయ్యిందో.. ఇప్పుడు పుష్ప పాటలోని షూ స్టెప్ కూడా అంతె ఫేమస్ అయ్యింది. ఈసారి షూ స్టెప్ లో మరింత ఎనర్జీటిక్ గా కనిపించారు బన్నీ. ప్రస్తుతం షూ హుక్ స్టెప్, అలాగే గ్లాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పాటలోని కొంత ట్రాక్ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు బన్నీ. “పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

అలాగే #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను తన పోస్టుకు జత చేశాడు. ఇక బన్నీ పోస్టుకు ఫ్యాన్స్, సెలబ్రెటీస్ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రియాక్ట్ అవుతూ.. “ఓ డియర్ ఇది చాలా బాగుంది. ఇప్పుడు నాకు కొంత పని పడింది” అంటూ బన్నీని ట్యాగ్ చేశాడు. ఇది చూసిన అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.. “ఇది చాలా సులభం.. మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను” అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ చాట్ నెట్టింట వైరలవుతుంది.

ఇప్పటికే డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాల్లోని స్టార్ హీరోస్ పాటలకు రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. టాప్ హీరోల సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్, డాన్స్ స్టెప్పులను రీల్స్ చేశారు. గతంలో లాక్ డౌన్ సమయంలో బన్నీ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు, డైలాగ్స్ రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు కూడా స్టెప్పులేశాడు వార్నర్. ఇక ఇప్పుడు త్వరలోనే పుష్ప2లోని టైటిల్ సాంగ్ షూ స్టెప్ వేసేందుకు రెడీ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.