Viral Photo: గంగోత్రి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
గంగోత్రి తర్వాత కావ్యకు తెలుగులో చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్, శ్రియా జంటగా నటించిన బాలు సినిమాలోని బాలనటిగా నటించి మెప్పించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా గంగోత్రి (Gangotri). డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా.. బన్నీ కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికీ శ్రోతలను మైమరపిస్తుంది. ఇందులో ప్రకాష్ రాజ్, సునీల్, శాకుంతల, అదితి అగర్వాల్ కీలకపాత్రలలో నటించారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన చిన్నారి కావ్య కూడా అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. గంగోత్రి సినిమా సమయంలో కావ్యకు నాలుగేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది కావ్య.
గంగోత్రి తర్వాత కావ్యకు తెలుగులో చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్, శ్రియా జంటగా నటించిన బాలు సినిమాలోని బాలనటిగా నటించి మెప్పించింది. అందమైన మనసు, అడవి రాముడు, విజయేంద్ర వర్మ వంటి సినిమాల్లో కనిపించింది. దాదాపు 12 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించింది. ప్రస్తుతం కావ్య లా పూర్తిచేసింది. లాయర్‌గా కొనసాగుతున్న కావ్యకు ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది.





Gangotri Kavya
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
