
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ బేస్ గూరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇతర దేశాల్లోనూ అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాక అనే సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అల్లు అర్జున్ అభిమానులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ కు అల్లు అర్జున్ ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించారు.
ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని అసోసియేషన్ మెంబర్స్ పేరుకొంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కూడా తన ఫాన్స్ అసోసియన్స్ మెంబర్స్ ను హైదరాబాద్ లో కలిశారు. ఇదిలా ఉంటే బన్నీ అభిమానులు సామాజిక సేవలో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు.
సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ లక్ష్యానికి మద్దతుగా ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిలబడింది. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్య రక్షణ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందుకొచ్చింది. మహిళలకు సంబందించిన సర్వైకల్ క్యాన్సర్‌ను అడ్డుకునే హెచ్‌పీవీ అనే వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా సదస్సులు నిర్వహించి, లక్ష మందికి పైగా 9 నుంచి 26 ఏళ్ల వయసు గల బాలికలు, యువతులకు సమగ్ర అవగాహన కల్పించారు. అల్లు అర్జున్ అభిమానులు చేసిన ఈ మంచి పని పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.