Pushpa 2: తగ్గేదేలే.. పుష్పగాడి క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. ఈ కుర్రాడు చేసిన పని చూస్తే షాకే..

| Edited By: Rajitha Chanti

Dec 20, 2024 | 10:25 AM

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తుంది. ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని జాతర సీన్ అడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇందులో బన్నీ మాస్ నట విశ్వరూపం చూసి విమర్శకులు సైతం అవాక్కవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్ చేసిన పని చూసి షాకవుతున్నారు నెటిజన్స్.

Pushpa 2: తగ్గేదేలే.. పుష్పగాడి క్రేజ్ అంటే ఇట్లుంటది మరి.. ఈ కుర్రాడు చేసిన పని చూస్తే షాకే..
Pushpa 2
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా క్రేజ్ హీటెక్కిస్తుంది. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ పూనుతున్నాడు. సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో హీరో ఒక సన్నివేశంలో గంగమ్మ దేవత వేషం కోసం చీర కూడా కట్టాడు. సినిమాలో ఈ ప్రత్యేకమైన సీన్ చాలా ఫేమస్ అయింది. ఆ సమయంలో వచ్చే పాట, హీరో యాక్టింగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ప్రస్తుతం ఈ గెటప్ దేశవ్యాప్తంగా అభిమానులను ఊర్రూతలూగిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ గెటప్ వేసుకుని తమ అభిమాన హీరోలా మురిసిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కూడా అలా వేషం కట్టిన ఒక యువకుడి గురించే.

ప్రస్తుతం యువత రీల్స్‌ వ్యామోహంలో ఉన్నారు. అందులో భాగంగానే రకరకాల పద్ధతుల్లో రీల్స్ చేసి ఫేమస్ అవుదామని చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్‌ నోయిడాలోని సెక్టార్‌ ఆల్ఫా-2లో ఓ యువకుడు అల్లు అర్జున్‌ గంగమ్మ వేషంతో వీధుల్లో తిరుగుతున్నాడు. చీర కట్టుకుని, అమ్మవారి అవతారంలా అలంకరించుకుని అచ్చం సినిమాలో హీరోలా తయారయ్యి రీల్స్ చేస్తున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న ఆ యువకుడిని ఎవరైనా పలకరిస్తే.. తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ హీరోలా ఫోజు కొడుతున్నాడు. ఇంకేముంది.. మొత్తానికి పుష్ప సినిమా క్రేజ్ వాడుకుని తెగ ఫేమస్ అయిపోదామని చూస్తున్నాడు. గంగమ్మ వేషధారణలో ఉన్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.