Pushpa 2 Movie: ఎట్టకేలకు ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అదిరిందిగా..

|

Oct 08, 2024 | 5:38 PM

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Pushpa 2 Movie: ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త పోస్టర్ అదిరిందిగా..
Pushpa 2 Movie
Follow us on

ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మూవీ పై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా ఈసారి పుష్పరాజ్, భన్వర్ సింగ్ షేకవత్ మధ్య నడిచే స్టోరీ చూసేందుకు పాన్ ఇండియా అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

పుష్ప 2 ఫస్టాఫ్ లాక్ అయిపోయిందని.. అలాగే ఫుల్ ఫైర్ తో లోడ్ అయ్యిందని.. పుష్ప ఫస్ట్ అఫ్ లాక్ అండ్ లో లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి.. ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ వెనక్కి నిలబడి కనిపించాడు. అంతకుమించి ఈ పోస్టర్‏లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా చిత్రయూనిట్ నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ చూసి అభిమానులు సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు.

నిజానికి ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మేరకు తొలి హాఫ్ ఎడిటింగ్, రీరికార్డింగ్ తదితర పనులన్ని పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా మ్యూజికల్ హిట్టయ్యింది. డిసెంబర్ 6న ఈ సినిమా మొదటి భాగం విడుదలవుతుండగా.. సంక్రాంతి వరకు పుష్ప 2 సందడి కొనసాగించే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.