AA-Atlee: అల్లు అర్జున్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. బాలీవుడ్‌ భామను కన్ఫమ్ చేసిన అట్లీ

ఆయన నడిస్తే ఒక ట్రెండ్.. ఆయన స్టైల్ అనుసరిస్తే అదొక బ్రాండ్. ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన ఆ స్టార్ హీరో, ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సత్తా చాటడానికి మరో భారీ సినిమాతో సిద్ధమయ్యారు.

AA-Atlee: అల్లు అర్జున్‌ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. బాలీవుడ్‌ భామను కన్ఫమ్ చేసిన అట్లీ
Allu Arjun Atlee And Bollywood Heroine

Updated on: Jan 29, 2026 | 8:22 AM

ఆయనకు తోడుగా సౌత్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ఒక స్టార్ డైరెక్టర్ జతకట్టారు. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వచ్చిన విశేషాలు చూస్తుంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, వెండితెరపై ఒక అద్భుతం అనిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, గతంలో ఎన్నడూ చూడని సరికొత్త టెక్నాలజీతో ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా ఒక క్రేజీ హీరోయిన్ ఎంట్రీతో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. షూటింగ్ స్పాట్‌లో అట్లీ చేస్తున్న ఆ విన్యాసాలు ఏంటి? బన్నీ రోల్ ఎలా ఉండబోతోంది?

అట్లీ లక్కీ ఛార్మ్..

ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​, స్టార్​ డైరెక్టర్​ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోన్ నటిస్తున్నట్లు అట్లీ అధికారికంగా ధృవీకరించారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “దీపికా నా లక్కీ ఛార్మ్. ‘జవాన్’ తర్వాత ఆమెతో చేస్తున్న రెండో సినిమా ఇది. తల్లైన తర్వాత ఆమె నటిస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో దీపికా చాలా కొత్తగా కనిపిస్తారు, ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది” అని ప్రశంసల వర్షం కురిపించారు. ‘కల్కి’ తర్వాత దీపికా నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే కావడం గమనార్హం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కోసం అట్లీ టీమ్ నిద్రలేని రాత్రులు గడుపుతోందట. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక విజువల్ వండర్ చూపించబోతున్నట్లు అట్లీ ధీమా వ్యక్తం చేశారు.

Allu Arjun Atlee And Deepika Padukone

ఈ సినిమాలో కేవలం దీపికా మాత్రమే కాదు, మరో ఇద్దరు హీరోయిన్లకు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. వీరితో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణ, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ చూస్తుంటేనే సినిమా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ ప్రాజెక్టును ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కాకముందే దీని ఓటీటీ డీల్స్ భారీ ధరలకు అమ్ముడవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, ‘పాన్ వరల్డ్’ రేంజ్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు అల్లు అర్జున్ స్టైల్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథకు కమర్షియల్ హంగులు అద్దడంలో అట్లీ సిద్ధహస్తుడు, దానికి బన్నీ పర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సిందే.