ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ అలియా భట్(Alia Bhatt ). జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో అలియా రామ్ చరణ్ జతగా సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలియా భట్ నటించిన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అలియా. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా చాల చురుగ్గా పాల్గొంది అలియా. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఎన్టీఆర్ 30లో అలియా భట్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని టాక్ వినిపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ కు జోడీగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందని టాక్ నడిచింది. తారక్ తో నటించడానికి ఎంతో ఉత్సాహం సైతం చూపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తుంది.
అలియాభట్ కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి అలియా తప్పుకుందని తెలుస్తుంది. 14వ తేదీన రణబీర్ కపూర్-అలియా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక 17 తర్వాత రణబీర్ -అలియా ఆప్రియా కి హనీమూన్కి వెళ్లబోతున్నారు. ఆతర్వాత ముందే కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేయనుందట. దాంతో తారక్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తెలుస్తుంది. అలియానే కావాలని అనుకుంటే మాత్రం సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం 2 ఏళ్ళు ఎదురుచూశారు తారక్ ఫ్యాన్స్.. ఇప్పుడు అలియా కారణంగా కొరటాల శివ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండటంతో అలియా ప్లేస్ లో మరో హీరోయిన్ ను వెతుకుతున్నారట కొరటాల టీమ్.
మరిన్ని ఇక్కడ చదవండి :