బాలీవుడ్‌పై ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఆ సీక్వెల్‌కు సెన్సార్ ఆలస్యం.. రిలీజ్ వాయిదా పడేనా.?

| Edited By: Ravi Kiran

Jul 15, 2023 | 11:00 PM

ఆదిపురుష్ ఎఫెక్ట్ బాలీవుడ్‌ను వదిలిపెట్టడం లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు సాధించకపోగా..

బాలీవుడ్‌పై ఆదిపురుష్ ఎఫెక్ట్.. ఆ సీక్వెల్‌కు సెన్సార్ ఆలస్యం.. రిలీజ్ వాయిదా పడేనా.?
Prabhas
Follow us on

ఆదిపురుష్ ఎఫెక్ట్ బాలీవుడ్‌ను వదిలిపెట్టడం లేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు సాధించకపోగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. తాజాగా ఈ సినిమా ఎఫెక్ట్ అప్‌కమింగ్ బాలీవుడ్ సినిమాల విషయంలోనూ గట్టిగా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ తరువాత కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. సినిమాలోని కొన్ని సీన్స్, డైలాగ్స్‌ హిందూ మైథాలజీని అవమానించేలా ఉన్నాయంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో మేకర్స్‌ సారీ చెప్పినా వివాదం మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

తాజాగా ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌ మరో మూవీ మీద పడింది. గతంలో సూపర్ హిట్ అయిన బాలీవుడ్‌ మూవీ ఓ మైగాడ్‌కు సీక్వెల్‌గా ఓ మైగాడ్ 2ను రూపొందించారు. ఆగస్టు 11న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డ్ ఆలోచనలో పడింది. డైరెక్ట్‌గా సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు నిరాకరించిన బోర్డ్, సినిమాను రివ్యూ కమిటీకి పంపించింది. దీంతో ఆన్‌ టైమ్ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ వస్తుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఓ మైగాడ్ సినిమా విషయంలో ఇలాంటి ఇబ్బందులేవి జరగలేదు. సినిమా రిలీజ్ తరువాత విమర్శలు వినిపించినా.. పూర్తి స్థాయిలో సినిమా మీద నెగెటివిటీ రాలేదు. కానీ ఓ మైగాడ్ 2 విషయంలో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వివాదానికి ఏదైనా కారణం కావచ్చని భావిస్తున్న సెన్సార్ బోర్డ్‌… సర్టిఫై చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.