Sankranthiki Vasthunnam: వెంకటేష్ స్ధానంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌‌! ఇద్దరు భామలతో ఆడిపాడనున్న స్టార్ హీరో

గతేడాది సంక్రాంతి బరిలో దిగి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. విక్టరీ వెంకటేష్ మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి డైరెక్షన్ కలిసి థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి.

Sankranthiki Vasthunnam: వెంకటేష్ స్ధానంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌‌! ఇద్దరు భామలతో ఆడిపాడనున్న స్టార్ హీరో
Venky And Meenakshi

Updated on: Jan 23, 2026 | 11:30 PM

తెలుగులో అంతటి భారీ విజయం సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పుడు బాలీవుడ్ గడ్డపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. హిందీ వెర్షన్‌లో వెంకీ పోషించిన ఆ పవర్ ఫుల్ పాత్రను ఒక బాలీవుడ్ స్టార్ హీరో చేయబోతున్నారు. అంతేకాదు, ఒరిజినల్ సినిమాలో ఉన్న హీరోయిన్ల స్థానంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఆ బాలీవుడ్ హీరో ఎవరు? తెలుగులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్రలను హిందీలో ఎవరు చేస్తున్నారు?

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్..

వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ బాధ్యతలను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భుజాన వేసుకున్నారు. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో దిల్ రాజు ఈ భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ కథ హిందీ నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసి తెరకెక్కించనున్నారు. తెలుగులో వెంకటేష్ సరసన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించగా, మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్‌గా మెప్పించింది. అయితే హిందీ రీమేక్ లో వీరి స్థానంలో కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి.

Raashi Khanna And Akshay

ఐశ్వర్య రాజేష్ పోషించిన సంప్రదాయబద్ధమైన భార్య పాత్రలో విద్యా బాలన్ నటించనున్నారు. చాలా కాలం తర్వాత విద్యా బాలన్ ఒక పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ లో కనిపించబోతుండటం విశేషం. మీనాక్షి చౌదరి చేసిన గ్లామరస్ పాత్రలో రాశీ ఖన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మొదట మీనాక్షినే తీసుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ, చివరకు రాశీ ఖన్నా వైపు మొగ్గు చూపారు.

భీమ్స్ సిసిరోలియో బాలీవుడ్ ఎంట్రీ..

తెలుగులో తన అద్భుతమైన జానపద బాణీలతో, మాస్ మ్యూజిక్ తో అదరగొడుతున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఆయన ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు అవే ట్యూన్స్ హిందీ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించబోతున్నాయి. అక్షయ్ కుమార్ టైమింగ్, అనీస్ బాజ్మీ మార్క్ కామెడీ కలిస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ హిందీలో కూడా వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి విద్యా బాలన్, రాశీ ఖన్నా లతో అక్షయ్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.