యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన సినిమా థాంక్యూ. రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికగోర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నాగచైతన్య. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ.. “థాంక్యూ లాంటి స్క్రిప్ట్స్ దొరకడం చాలా కష్టం. డైరక్టర్లు సింగిల్ లుక్ ఉన్న సినిమాలే ఎక్కువగా చెబుతుంటారు. ఒకవేళ మార్పు ఉన్నా, ఫ్లాష్ బ్యాక్‌లో చిన్న మార్పు ఉంటుంది. అంతకు మించి చేంజెస్ ఉండవు. థాంక్యూ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలెంజింగ్ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్ లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్లు 20 ఏళ్లు, 2 5 ఏళ్లు, 30 ఏళ్లు, 36 ఏళ్లు ఇలా రకరకాల ఫేజెస్ చూపించాం” అని చెప్పుకొచ్చారు.
అలాగే ” సినిమాలో ఏదో కొత్త విషయం ఉన్నప్పుడే ఆడియెన్స్ సినిమా థియేటర్స్‌కు వస్తున్నారు. ట్రైలర్ చూసే సినిమాను చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికలో నా మైండ్ సెట్ మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్ అనే విషయాలను పక్కన పెడితే కంటెంట్ ఈజ్‌కింగ్ . థాంక్యూ మూవీ ఓ టైమ్ లైన్‌లో వెళుతుంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ సమయంలో తెలుగులో హిట్ సినిమాలేంటనే దాన్ని కూడా సినిమాలో చూపించాం. మహేష్‌గారి ఒక్కడు, పోకిరి ఇలా డిఫరెంట్ స్టేజెస్‌లో ఆయన సినిమాలను కవర్ చేసుకుంటూ వచ్చాం. థాంక్యూ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్ అయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను. ఈ సినిమా కోసం చాలానే తగ్గాను. ఈ సినిమా కన్నా ముందే లాల్‌సింగ్ చద్దా కోసం 25 కిలోలు తగ్గాను. అది ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది ” అని చెప్పుకొచ్చారు.