Naga Chaitanya : ఇంటెన్స్ లుక్‌తో అదరగొట్టిన అక్కినేని యంగ్ హీరో.. నాగచైతన్య నయా ఫోటో అదుర్స్..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మంచి జోరుమీదున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో గత ఏడాది మంచి విజయాన్ని..

Naga Chaitanya : ఇంటెన్స్ లుక్‌తో అదరగొట్టిన అక్కినేని యంగ్ హీరో.. నాగచైతన్య నయా ఫోటో అదుర్స్..
Naga Chaitanya

Edited By:

Updated on: Feb 05, 2022 | 7:32 AM

Naga Chaitanya : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మంచి జోరుమీదున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ సినిమాతో గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు చైతన్య. ఈ సినిమా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. తెలంగాణ యాసలో మొదటి సారి మాట్లాడి ఆకట్టుకున్నాడు నాగచైతన్య. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే  ఈ ఏడాది కింగ్ నాగార్జున తో కలిసి బంగార్రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికానుకగా విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కింది.

ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమాలో చైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా చైతన్య కనిపించనున్నాడట. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రష్యా రాజధాని మాస్కో నగరంలో జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఓ ఫొటోని నాగచైతన్య సోషల్ మీడియా ఇన్ స్టా వేదిగా అభిమానులతో పంచుకున్నారు. కళ్ళద్దాలతో ఇంటెన్స్ లుక్ తో కనిపించాడు చైతన్య. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖార్ నటిస్తున్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్‌ సినిమా సాంగ్‌ లాంఛ్‌లో రాజశేఖర్‌ భావోద్వేగం..

Bhanu Shree: లేహంగాలో అట్రాక్ట్ చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

CPI Narayana: జగన్ చిన్న పిల్లాడు.. నాగార్జున అంటే నాకు అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణ