Agent OTT: ‘ఏజెంట్’ ఓటీటీలోకి ఆలస్యం అవ్వడానికి కారణమిదే.! అందుకేనా లేట్..

|

Jun 01, 2023 | 9:36 AM

అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ఏజెంట్'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Agent OTT: ఏజెంట్ ఓటీటీలోకి ఆలస్యం అవ్వడానికి కారణమిదే.! అందుకేనా లేట్..
Agent Movie
Follow us on

అఖిల్ అక్కినేని, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు తీవ్ర నిరాశను మిగిల్చి.. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ నష్టాన్ని తగ్గించుకునేందుకు ఓటీటీలోకి నెల రోజుల కంటే ముందే రిలీజ్ చేయాలని భావించారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను సోనీ లివ్ సంస్థ దక్కించుకోగా.. ఆ వెంటనే మే 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

అయితే ఏజెంట్ చిత్రం మాత్రం విడుదలయ్యి నెల రోజులు కావొస్తున్నా, ఇంకా ఓటీటీలోకి రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ‘ఏజెంట్’ ఓటీటీ ఆలస్యానికి గల కారణం ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏజెంట్ మూవీ ఎడిటింగ్, ఔట్‌పుట్ సరిగ్గా లేకపోవడంతోనే థియేటర్లలో ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కనీసం ఓటీటీలోనైనా రీ-ఎడిట్ చేసి కాస్త బెటర్ ఔట్‌పుట్‌తో రిలీజ్ చేద్దామని మేకర్స్ భావించారట. దీంతో ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని.. పూర్తి కాగానే ఓటీటీలో విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అవన్నీ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో వేచి చూడాలి.

కాగా, స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో డినో మోరియా, మమ్మూట్టీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీకి కథ వక్కంతం వంశీ అందించగా.. బాణీలను హిప్ హాప్ టమిజా స్వరపరిచాడు.