
అఖండ సినిమాకే అడ్డంకులు సృష్టించారంటే… సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టా? ఒక రోజు ముందు సినిమా రిలీజ్ ఆగడం వేరు. సినిమా టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన తరువాత.. ఇంకో గంటలో రిలీజ్ అవుతున్న తరుణంలో ఆగడం వేరు. చాలా సీరియస్ మ్యాటర్ అది. సో, సినీ ప్రేక్షకులకి తెలియని స్టోరీ ఏదో ఇండస్ట్రీలో నడుస్తోంది? ఏంటది? బాలకృష్ణ సినిమానే ఆపేంత వరకు వచ్చిందంటే.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? టాలీవుడ్.. అనుకున్నంత గట్టిగా ఏమీ లేదనుకోవాలా? అఖండ-2 సినిమాపై నెగిటివిటీ నిజమే. నిర్మాత రామ్ ఆచంట అన్న ఈ మాటను సీరియస్‌గా చూడాల్సి ఉంది. రిలీజ్‌కు ముందు, రిలీజ్ తరువాత జరిగిన టోటల్ ఎపిసోడ్‌పై నిర్మాతలు చేసిన కామెంట్స్ కేవలం అఖండ మీదనే కాదు.. ఓవరాల్ ఇండస్ట్రీ మీద చేసినట్టు అనుకోవాలంటున్నారు. అఖండ-2 సినిమా రిలీజ్ సడన్‌గా ఆగిపోగానే.. కొందరు పనిగట్టుకుని మరీ జరిగిందేంటో తెలుసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా విడుదలను పోస్ట్‌పోన్ చేయడం వెనక కారణం.. చాలా పెద్దదే. అలాగని బయటకు చెప్పేదీ కాదు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన పరిష్కారం. స్వయంగా నిర్మాత సురేష్ బాబే ఈ మాట అన్నారు. సైకో సిద్ధార్థ సినిమా ఈవెంట్‌లో ఓపెన్‌గా చేసిన కామెంట్స్ ఇవి. అదొక ఫైనాన్షియల్ ఇష్యూ అని చెప్పేశారు కూడా. అన్నట్టుగానే నాలుగు గోడల మధ్యే సమస్య పరిష్కారం అయింది. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు...