Ajith Kumar: షూటింగ్‏లో అజిత్ కారుకు పెను ప్రమాదం.. వీడియో వైరల్..

|

Apr 04, 2024 | 3:04 PM

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలారోజుల క్రితమే ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు చిత్రయూనిట్. అలాగే ఈమూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అజిత్ ఆరోగ్య సమస్యలు, సర్జరీ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.

Ajith Kumar: షూటింగ్‏లో అజిత్ కారుకు పెను ప్రమాదం.. వీడియో వైరల్..
Ajith Kumar
Follow us on

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో తునీవు సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అజిత్ నటిస్తోన్న సినిమా విడతల. సస్సెన్స్ థ్రిల్లర్‏గా వస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అఏర్జున్, అరుణ్ విజయ్, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలారోజుల క్రితమే ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు చిత్రయూనిట్. అలాగే ఈమూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అజిత్ ఆరోగ్య సమస్యలు, సర్జరీ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.

విడతల సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరోప్ దేశంలో జరుగుతుంది. ఈ క్రమంలోనే అజిత్ కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అజిత్ నడుపుతున్న కారు సైడ్ ఆమె ప్రయత్నంలో కారుపై అతడు నియంత్రణ కోల్పవడంతో రోడ్డు పక్కకు కారు పడిపోయినట్లుగా తెలుస్తోంది. అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరవ్ కనిపిస్తున్నాడు. అతడి చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్లుగా కనిపిస్తుంది. విడుతల షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేస్తూ విదాముయార్చి చిత్రీకరణ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. విడతల చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే అంచనాలు కలిగిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే అజిత్ కు సంబంధించిన హై రిస్క్ సీన్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అజిత్, నటుడు ఆరవ్ ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.